ఉత్సాహంగా ‘సిద్ధార్థ’ ఫ్రెషర్స్‌ డే

10 Nov, 2016 00:07 IST|Sakshi
ఉత్సాహంగా ‘సిద్ధార్థ’ ఫ్రెషర్స్‌ డే

చిన్న ఆవుటపల్లి(గన్నవరం రూరల్‌) :  మండలంలోని చిన్న ఆవుటపల్లి డాక్టర్స్‌ సుధా అండ్‌ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాల ఫ్రెషర్స్‌డే వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. హాజÆ హనుమార గ్యాలరీలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యఅతిథిగా హాజరైన సిద్థార్థ అకాడమీ అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉత్తమ వైద్యులుగా పనిచేయాలని సూచించారు. వైద్యుడి గొప్పదనాన్ని రోగులు మౌత్‌ పబ్లిసిటీ ద్వారా ప్రచారం చేస్తారని అన్నారు. నైపుణ్యాన్ని పెంచుకుంటూ, రోగులతో సేవాభావం, మంచి మాటలతో ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. కళాశాల డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సి.నాగేశ్వరరావు మాట్లాడుతూ స్కిల్స్‌ నిరంతరం పెంచుకునే వైద్య రంగంలో దంత వైద్య విద్యార్థులుగా చేరిన బీడీఎస్‌ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామోజీరావు మాట్లాడుతూ అత్యుత్తమ ప్రమాణాలతో కళాశాలను తీర్చిదిద్దినట్లు చెప్పారు. కార్యక్రమంలో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మూర్తి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎ¯Œæవీ కృష్ణారావు, అకాడమీ ప్రతినిధి చక్రధరరావు, దంత వైద్య కళాశాల ఎవో వై.మధుసూదనరావు, మెడికల్‌ కళాశాల ఎవో కిరణ్‌ పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

 

మరిన్ని వార్తలు