పౌర సమాజం మౌనం అణుబాంబు కంటే ప్రమాదకరం

10 Oct, 2015 23:36 IST|Sakshi
పౌర సమాజం మౌనం అణుబాంబు కంటే ప్రమాదకరం

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి
 
 హైదరాబాద్: పౌర సమాజం మౌనం అణుబాంబు కంటే ప్రమాదకరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. నిరంతరం ప్రశ్నించేతత్వం ఉండాలని, ఈ క్రమంలో సంయమనం పాటించాలన్నారు. ప్రొఫెసర్ ఎం.కోదండరాం ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ప్రజా స్వామ్యం-  పౌర సమాజం’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాంను ఘనంగా సత్కరించారు. కోదండరాంను అభినందిస్తే పౌర సమాజాన్ని గౌరవించినట్లేనని అభిప్రాయపడ్డారు. రైతుల ఆత్మహత్యలు పెరిగినా నకిలీ విత్తనాలపై నియంత్రణ, పర్యవేక్షణ కరువైంద న్నారు.

ఏ దేశంలో కూడా అపరిమితమైన వనరులు ఉండవని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమైన అంశంపైనే దృష్టి సారించాలన్నారు. మన దేశంలో రాజకీయ నాయకులను సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలని, ఆ ఫలితాలు అందరికీ దక్కాలనే భావనతో భవిష్యత్‌లో ప్రజల పక్షాన నిలబడి పని చేస్తానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు గురజాల రవీందర్‌రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిప్పర్తి యాదయ్య, నాయకులు మల్లేపల్లి లక్ష్మయ్య, స్వర్ణలత, పి.రమ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు