సిలికా లారీల పట్టివేత

18 Sep, 2016 22:54 IST|Sakshi
సిలికా లారీల పట్టివేత
 
 చిల్లకూరు : మండల తీర ప్రాంతంలోని సిలికా గనుల నుంచి నిబంధనలకు మించి అధిక లోడుతో సిలికా తరలిస్తున్న మూడు లారీలను గనులశాఖాధికారులు పట్టుకున్నారు. ఆదివారం వేకువజామున వరగలి క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్న అధికారులు సిలికాను తరలిస్తున్న మూడు లారీలను ఆపి పరిశీలించారు. ఈ సందర్భంగా అధిక లోడుతో సిలికా తరలిస్తున్నట్లు గుర్తించి లారీలను చిల్లకూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీటికి అపరాధ రుసుము విధించనున్నట్లు అధికారులు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు