సింధు నాగరికత నాటి శిల్పతోరణం లభ్యం

26 Jul, 2015 01:18 IST|Sakshi
సింధు నాగరికత నాటి శిల్పతోరణం లభ్యం

చేర్యాల: సింధు నాగరికత నాటి స్త్రీల యుద్ధవిజయోత్సవాల శిల్ప తోరణం లభ్యమైంది. శనివారం వరంగల్ జిల్లా చేర్యాల గుర్జకుంట వాగులోని రామన్నబండ ప్రాంతంలో పరుపు బండపై ఈ శిల్పతోరణం లభ్యమైనట్లు పురావస్తు పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి తెలిపారు.  ఈ శిల్పతోరణం మూడు మీటర్ల పొడవు, 40 సెంటీమీటర్ల వెడల్పు తో ఉంది. ఇందులో ఆరుగురు స్త్రీలు యుద్ధం లో కత్తి పట్టుకొని ఉన్నట్లు కనిపోస్తోంది. ఈ తోరణం మధ్యలో ఆయుధారిగా గణపతి, ఎడమ వైపు ఇద్దరు స్త్రీలు నాట్యం చేస్తూ..

ఒకరు వీణపట్టుకొని వస్తున్నట్లు, మరోవైపు ఆరుగురు స్త్రీలు కత్తి పట్టుకొని వినాయకుడి వైపు ఉంది. వినాయకుడి కుడివైపున త్రిశూలధారి ఒకరు విజయోత్సవాలను తెలిపే జెండాలను పట్టుకున్నట్లు, దానిపక్కన ఒక వీరుడు , చివరకు నాగిణి బొమ్మ చెక్కి ఉంది. మిగతా శిల్పాలు చెదిరిపోయి ఉన్నాయి. వీటితో పాటు సింధు నాగరికతలో లభించిన ఒక ముద్రపై మేకను బలి ఇచ్చే దృశ్యం పైన ఉండగా... కింద ఏడుగురు మహిళా పూజారిణిలు  ఉన్నారు.

వీటిని బట్టి మాతృస్వామ్య కుటుంబాలు ఉన్నట్లు అర్థమవుతోందని రత్నాకర్‌రెడ్డి చెప్పారు.  ఇదే ప్రదేశంలో మరో చోట ఆరు వరుసలతో రాసి ఉన్న ఒక శాసనం బర్రె పోచిరెడ్డి చెల్కలో పడి ఉందని, దానిపై రెండు రాతి గొడ్డళ్లు, మృణ్మయ పాత్రలు నవీన యుగం నాటివన్నారు.  వీటిని బట్టి ఈ ప్రాంతంలో ఆదిమానవులు సంచరించినట్లు తేలిందన్నారు.

మరిన్ని వార్తలు