సిమ్స్‌ విద్యార్థుల ప్లాష్‌ మాబ్‌

12 Dec, 2016 15:10 IST|Sakshi
సిమ్స్‌ విద్యార్థుల ప్లాష్‌ మాబ్‌
 
గుంటూరు మెడికల్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్‌ భూతాన్ని తరిమి వేసేందుకు ప్రజల్లో అవగాహన కలిగేలా సిమ్స్‌ విద్యార్థులు ఫ్లాష్‌మాబ్‌ నిర్వహించారు. వరల్డ్‌ ఎయిడ్స్‌ డేను పురస్కరించుకుని గురువారం ఉదయం మార్కెట్‌ సెంటర్‌లో సిమ్స్‌ విద్యార్థుల ఫ్లాష్‌మాబ్‌ జరిగింది.హెచ్‌ఐవీ ఏవిధంగా సోకుతుంది, హెచ్‌ఐవీ సోకిన వారిని ఏవిధంగా ఆదరించాలి, ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీ బాధితులకు ఏవిధంగా వైద్యం అందించాలి అనే విషయాలను ఫ్లాష్‌మాబ్‌ ద్వారా విద్యార్థులు వివరించారు. విద్యాసంస్థల డైరెక్టర్‌ భీమనాధం భరత్‌రెడ్డి, సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ డాక్టర్‌ బి.శివశిరీష ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఎయిడ్స్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మార్కెట్‌ సెంటర్‌లో సుమారు 2గంటల సేపు విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌మాబ్‌ను అధిక సంఖ్యలో ప్రజలు వీక్షించారు.
 
 
 
మరిన్ని వార్తలు