సింగరేణిలో ఖాళీలు భర్తీ చేయాలి

9 Jun, 2016 02:43 IST|Sakshi
సింగరేణిలో ఖాళీలు భర్తీ చేయాలి

అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలి
వారసత్వ హక్క  పునరుద్ధరించాలి
ఓపెన్‌కాస్టులతో పర్యావరణానికి విఘాతం
సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్(బీఎంఎస్) అధ్యక్షుడు చింతల సూర్యనారాయణ.

 
రామగుండం : సింగరేణి సంస్థలో ఉద్యోగ విరమణ చేస్తున్న కార్మికుల స్థానంలో కొత్త వారిని నియమించాలని, వారసత్వ ఉద్యోగావకాశాలు ఇవ్వాలని సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) జాతీయ అధ్యక్షుడు చింతల సూర్యనారాయణ అన్నారు. కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రామగుండం పట్టణానికి చెందిన కౌశిక హరిని ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

సింగరేణిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవడంతో ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నా ఉద్యోగులు, కార్మికులు ఉద్యోగ విరమణ పొందుతున్న వారి స్థానంలో ఖాళీల ను మాత్రం భర్తీ చేయడంలేదని పేర్కొన్నారు. దీంతో ఉన్నవారిపై భారం పడుతోందని తెలి పారు. సింగరేణిలో 50-60 మెట్రిక్ టన్నులకు మాత్రం ఉత్పత్తి పెరిగిందని, కార్మికుల సంఖ్య 1.25 లక్షల నుంచి 57 వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, అధికారి కార్మిక సంఘం వారసత్వ ఉద్యోగాలను మరిచిందని ఎద్దేవా చేశారు. ఓపెన్‌కాస్టుల ఏర్పాటుకు కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ వ్యతి రేకమని, ఓపెన్‌కాస్టులతో పర్యావరణానికి విఘాతం కలుగుతోందన్నారు. సింగరేణి సం స్థలో ఉన్నత స్థానంలో ఉద్యోగాల కల్పనకు కో ల్ ఇండియా మాదిరిగా నోటిఫికేషన్ జారీ చేయకుండా అత్యధిక విద్యావంతులైన కార్మికులలో నే అర్హులైన వారిని ఎంపిక చేయాలని, వారి స్థానంలో వారసులకు ఉద్యోగావకాశాల ను కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే తొమ్మి దో వేజ్‌బోర్డు ఒప్పందంలో కార్మికులకు అన్యా యం జరిగిందని, కార్మిక హక్కుల సాధనతోపాటు జూలై నుంచి అమలుకానున్న పదో వేజ్‌బోర్డులో కార్మికులకు సంపూర్ణ న్యాయం జరి గే విధంగా గోదావరిఖని నుంచి గోలేటి వరకు ఈనెల 3 నుంచి భరోసా యాత్ర చేపడుతున్న ట్లు తెలిపారు. సమావేశంలో కేంద్ర నిర్వాహక కార్యదర్శి టంగుటూరి కొమురయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కౌశిక హరి, ఉపాధ్యక్షుడు పూల నాగరాజు, రాష్ట్ర కోకన్వీనర్ బూర్ల లక్ష్మీనారాయణ, వడ్డెపల్లి రాంచందర్, పెద్దపల్లి రవీం దర్, సుల్వ లక్ష్మీనర్సయ్య, కోమళ్ల మహేశ్, బాలరాజ్‌కుమార్, గాలిపెల్లి తిరుపతి, బోడకుంట జనార్దన్, శివరాత్రి సారయ్య, నాయని రాజేశం, తీగుట్ల లింగయ్య, కండె మధు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు