అలరించిన సంగీత విభావరి

12 Oct, 2016 23:11 IST|Sakshi
అలరించిన సంగీత విభావరి
పాత గుంటూరు: బృందావన్‌గార్డెన్స్‌ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దసరా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా అలంకరించడంతో భక్తులు అధికసంఖ్యలో దర్శించుకొని  పూజలు నిర్వహించారు. ఆంధ్రాబ్యాంకు గార్డెన్స్‌ శాఖ ఆధ్వర్యంలో అన్నమయ్య కళావేదికపై మహతీస్వరసుధ వారి సినీసంగీత విభావరిలో గాయకులు అమ్మవారి భక్తిగీతాలను ఆలపించారు. ఆలయకమిటీ అధ్యక్షుడు సి.హెచ్‌ మస్తానయ్య బ్యాంకు డి.జి.యం చదలవాడ ధనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు