ఏకశిల వినాయక మండపం

4 Sep, 2016 01:31 IST|Sakshi
ఏకశిల వినాయక మండపం
ఆళ్లగడ్డ: పట్టణంలో శిల్పకళాకారులు తయారు చేసిన ఏకశిల వినాయక మండపం ఆకట్టుకుంటోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు..వినాయక చవితికి ప్రతిష్టించుకునేలా ఒకే రాతి మండపం..అందులో వినాయక విగ్రహం తయారుచేసి ఇవ్వాలని శిల్పకళా సమితి సభ్యులను సంప్రదించారు. దీంతో శిల్పి జాఫర్‌ సుమారుగా ఏడాది పాటు కష్టపడి ఈ మండపాన్ని తయారు చేశారు. మండపం 11. 6 అడుగల ఎత్తు, 8 టన్నుల బరువు ఉందని జాఫర్‌ తెలిపారు. వినయక చవితి రోజు ప్రతిష్టించుకునేందుకు శనివారం ప్రత్యేక వాహనంలో దీనిని తెలంగాణ ప్రాంతానికి తీసుకెళ్లారు.
 
మరిన్ని వార్తలు