సార్‌.. కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడు

12 Dec, 2016 15:16 IST|Sakshi
సార్‌.. కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడు
- ఆపరేషన్‌కు డబ్బులిచ్చి ఆదుకోండి
- బ్యాంక్‌ వద్ద ఖాతాదారుడు ఆవేదన
 
గూడూరు: చిత్రంలో బ్యాంక్‌ పాసు పుస్తకం పట్టుకుని కనిపిస్తున్న వ్యక్తి పేరు కుర్వ నరసింహులు. పొన్నకల్లు గ్రామానికి చెందిన వ్యక్తి.  ఆయన కుమారుడు 11 ఏళ్ల విజయ్‌ నెల రోజుల క్రితం ఇంటి దగ్గర ఆట ఆడుకుంటూ కిందపడటంతో చేతికి గాయమైంది. గూడూరులోని ఓ డాక్డర్‌కు చూపించి మందులు ఇప్పించారు. అయితే గాయం మానకపోవడంతో వారం రోజుల క్రితం కర్నూలులోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రికి వెల్లి చూపించగా చేయి విరిగిందని శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. ఇందుకు రూ.30 వేలు ఖర్చు అవుతుంది చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను  రద్దుతో తన దగ్గరున్న రూ. 60 వేలను ఇటీవల స్థానిక ఎస్‌బీఐలోని ఖాతాలో వేశాడు. ప్రసుత్తం కుమారుడి ఆపరేషన్‌ కోసం డబ్బులు అవసరం కావడంతో స్థానిక ఎస్‌బీఐ చుట్టూ వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు. బ్యాంక్‌లో డబ్బులు లేకపోవడంతో రేపు, మాపు అంటూ తిప్పుకుంటున్నారు. ఆసుపత్రి వైద్యులు గురువారం నాటికంతా డబ్బులు కట్టకపోతే ఆపరేషన్‌ చేయమని చెప్పారు. బుధవారం స్థానిక ఎస్‌బీఐ దగ్గర పాసు పుస్తకం చేతిలో పట్టుకుని కనిపించిన వారినంతా సాయం చేయమని అడుగుతున్నాడు. బ్యాంక్‌ సిబ్బంది మాత్రం రూ.2 వేలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో కన్నీటి పర్యంతం అయ్యాడు. ఉన్నతాధికారులు స్పందించి తన డబ్బు తనకి ఇప్పించాలని వేడుకుంటున్నాడు.    
 
మరిన్ని వార్తలు