విద్యార్థి దశనుంచే సాహిత్యంపై మక్కువ అలవర్చుకోవాలి

30 Jan, 2017 23:01 IST|Sakshi
విద్యార్థి దశనుంచే సాహిత్యంపై మక్కువ అలవర్చుకోవాలి
  • ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల
  • పెద్దాపురం : 
    విద్యార్థి దశ నుంచే సాహిత్యంపై మక్కువ అలర్చుకోవాలని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. స్థానిక శ్రీ ప్రకాష్‌ సినర్జీ పాఠశాలను ఆయన సోమవారం సందర్శించారు. ఆయనకు పాఠశాల డైరెక్టర్‌ సతీమణి చిట్టూరి సమీర సాదర స్వాగతం పలికారు. విద్యార్థులనుద్దేశించి సిరివెన్నెల మాట్లాడుతూ, అమ్మ మాట, అమ్మ పాట, అమ్మ భాష అని పలుకుతూ అమ్మ గొప్పదనాన్ని వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు బీవీ చలం సిరివెన్నెలపై రచించిన గేయాన్ని చిన్నారులు ఆలపించారు. అనంతరం పాఠశాల చిత్రకళా ఉపాధ్యాయుడు కత్తి శ్రీనివాస్‌ ‘సిరివెన్నెల దృశ్య రూపకల్పన’ చిత్రపటాన్ని చిట్టూరి సమీర చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల డీ¯ŒS బండారు రాజేశ్వరి, కాకినాడ కిడ్స్‌ చీఫ్‌ మెంటర్‌ కనకదుర్గ, ఏఓ శ్రీరామకృష్ణ, లైజా¯ŒS ఆఫీసర్‌ ఎం.సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.
    సత్యదేవుని సన్నిధిలో..
    అన్నవరం : కుటుంబ సభ్యులతో కలిసి సీతారామశాస్త్రి సోమవారం రాత్రి రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. అనంతరం వారికి వేదపండితులు ఆశీస్సులందజేసి, ప్రసాదాలు బహూకరించారు. సిరివెన్నెలను దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిశారు. సిరివెన్నెల వెంట తుని శ్రీప్రకాష్‌ విద్యాసంస్థల నిర్వాహకుడు ప్రకాష్‌ తదితరులున్నారు.
     
మరిన్ని వార్తలు