ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

15 Dec, 2016 23:44 IST|Sakshi
  • ఆదెమ్మదిబ్బ స్థలంపై బీజేపీ డిమాండ్‌
  • స్థల వారసులెవ్వరూ లేరు
  • 50 ఏళ్లుగా పేదలు ఇక్కడే ఉంటున్నారు
  • వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలి 
  • స్థలాన్ని పరిశీలించి పేదలతో మాట్లాడిన బీజేపీ బృందం
  • తమకు న్యాయం చేయాలని బాధితుల విన్నపం
  • ప్రభుత్వం తమకు ఇళ్లు కట్టించాలని వేడుకోలు
  • ‘సాక్షి’ వరుస కథనాలతో కదలిక 
  • సాక్షి, రాజమహేంద్రవరం :
    గత 50 ఏళ్లుగా పేదలు నివశిస్తున్న ఆదెమ్మ దిబ్బ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భార తీయ జనతా పార్టీ (బీజేపీ) డిమాండ్‌ చేసింది. సత్యవోలు పాపారావుకు చెందిన ఈ స్థలానికి ప్రస్తుతం వారసులెవ్వరూ లేరని, ఈ భూమి అక్రమణకు గురికాకుండా చూడాలని పేర్కొంది. నగర నడి బొడ్డున ఉన్న ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని డిమాండ్‌ చేసింది. గురువారం బీజేపీ అర్బ¯ŒS జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు నేతృత్వంలోని బీజేపీ బృందం ఆదెమ్మదిబ్బ స్థలాన్ని పరిశీలించింది. అనంతరం అక్కడ ఉన్న పేదలతో మాట్లాడి వివరాలు సేకరించింది. తాము ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నామని, ఇప్పడు ఎవరో వచ్చి తాము ఈ స్థలం కొనుగోలు చేశామని చెబుతూ ఖాళీ చేయిస్తున్నారని బీజేపీ బృందం వద్ద వాపోయారు. తమలో కొంత మందికి రూ.50 వేల నుంచి రూ.70 వేలు ఇచ్చారని పేర్కొన్నారు. తమలో వాంబే గృహాలు ఉన్నవారు ముందుగా ఖాళీ చేయడంతో ఇతరులు కూడా ఖాళీ చేయాల్సి వచ్చిందన్నారు. తమ ఇళ్లకు డబ్బులు ఇచ్చిన వారే తొలగిస్తున్నారని పేర్కొన్నారు. అద్దెలు కట్టుకోలేక చాలా మంది ఇక్కడే చెట్ల కింద ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ స్థలానికి సంబంధించిన వారసులెవ్వరూ లేనప్పుడు మీరు ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చిందని’ బీజేపీ నేతలు బాధితులు ప్రశ్నించారు. నిజంగా ఇళ్లులేని వారు ఇక్కడే తిరిగి గుడిసెలు వేసుకోవాలని, మీకు తాము అండగా ఉంటామని బీజేపీ అర్బ¯ŒS జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు భరోసా ఇచ్చారు. మీతోపాటు నగర శివారులో ఉన్న పేదలతో ఇక్కడ గుడిసెలు వేయిస్తానని పేర్కొన్నారు. త్వరలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో మాట్లాడి అర్బ¯ŒS హౌసింగ్‌ పథకం కింద అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. 
    అధికార పార్టీల చుట్టూ తిరుగుతున్నా...
    రెండు నెలల నుంచి ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఒక్కరూ పట్టించుకోలేదని పేదలు వాపోయారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, ఎంపీ మురళీమోహ¯ŒSల చుట్టూ తిరిగి తమ గోడు వెళ్లబోసుకుంటే వారందరూ ’ ఆ స్థలం ఎవరో కొన్నారట కదా. ఖాళీ చేయక తప్పదు’ అని మాకు హితబోధ చేయడం ఆవేదన కలిగిస్తోందని వాపోయారు.  
    స్థల వారసులెవరూ లేరు...
    స్థలాన్ని పరిశీలించిన అనంతరం బొమ్ముల దత్తు విలేకర్లతో మాట్లాడుతూ తమ పార్టీ కార్యాలయం కోసం ఈ భూమిని కొనుగోలు చేద్దామని కొన్నేళ్ల కిత్రం సత్యవోలు పాపారావు వద్దకు వెళితే అక్కడ పేదలు ఉంటున్నారంటూ చెప్పారని అన్నారు. ఈ స్థలంలో కుందుల కుటుంబానికి వాటా ఉందన్నారు. గతంలో వాంబే గృహాల కోసం జరిపిన స్థల సేకరణలో వివాదం నెలకొందని గుర్తు చేశారు. వాంబే గృహాలు కట్టగా మిగిలిన స్థలంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను నిర్మించాలన్న ప్రతిపాదన కూడా ఉందని తెలిపారు. 45వ డివిజ¯ŒS పరిధిలో ఆకుల సూర్యారావుకు చెందిన 2.5 ఎకరాల స్థలంలో పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని, అలాగే 47వ డివిజ¯ŒS పరిధిలో ఎకరా స్థలంలో దొడ్డి శేషగిరి స్థలంలో కూడా పలువురు ఇళ్లు కట్టుకున్నారని పేర్కొన్నారు. అక్కడ నగరపాలక సంస్థ నీటి కుళాయిలు, సిమెంట్‌ రోడ్లు వేసిందని, ఇంటి పన్నులు కూడా కట్టించుకుంటోందని తెలిపారు. ఆదెమ్మ దిబ్బ స్థలంలో పేదలకు ప్రభుత్వమే పక్కా ఇల్లు కట్టించి, అన్ని వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ బృందంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గరిమెళ్ల చిట్టిబాబు, 47వ డివిజ¯ŒS కార్పొరేట్‌ రేలంగి శ్రీదేవీ, ఆర్యాపురం కోఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ యొనుముల రంగబాబు, పట్టణ  ప్రధాన కార్యదర్శులు అడబాల రామకృష్ణ, బూరా రామచంద్రరావు, 36, 37 డివిజన్ల అధ్యక్షులు తంగెళ్ల శ్రీనివాసరావు, గుత్తుల సుదర్శనరావు, మీడియా సెల్‌ ఇ¯ŒSచార్జ్‌ దాస్యం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు