కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

18 Jan, 2016 06:08 IST|Sakshi
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు
మృతుల్లో చిన్నారి సహా ఇద్దరు మహిళలు
మృతులు మహబుబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ వాసులుగా గుర్తింపు

కర్నూలు: కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం మల్లేపల్లి స్టేజీ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందారు. కేరళ నుంచి మహబుబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ వైపు అతివేగంగా వెళుతున్న (ఏపీ35 ఎమ్‌7677)  నంబర్‌గల కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

మృతుల్లో ఐదు నెలల చిన్నారి సహా ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులు మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ వాసులు.. మక్తల్‌లోని కేరళ టెక్నో స్కూల్‌ యజమాని రూబెన్‌, ఆయన తల్లిదండ్రులు, భార్య ఐదు నెలల కుమారుడు, కారు డ్రైవర్‌ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు