పన్నులు చెల్లిస్తారా? జప్తు చేయమంటారా?

10 Mar, 2017 22:50 IST|Sakshi
పన్నులు చెల్లిస్తారా? జప్తు చేయమంటారా?

స్కిట్‌ కళాశాల బకాయిలపై మున్సిపల్‌ కమిషనర్‌

శ్రీకాళహస్తి: స్కిట్‌ కళాశాల యజమాన్యం 2011 నుంచి రూ.60లక్షల ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉందని..నోటీసులిచ్చినా పట్టించుకోవడంలేదని మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రయ్య ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకర్‌రెడ్డికి తెలిపారు. శుక్రవారం మున్సిపల్‌ కమిషనర్‌ కళాశాల వద్దకు వెళ్లి ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ రెడ్డితో పన్నుల బకాయిలపై చర్చించారు. పన్ను చెల్లించకపోతే కళాశాలను సైతం జప్తు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో స్పందించిన ప్రిన్సిపాల్‌ 2013 నుంచి మాత్రమే పన్నులు చెల్లించాల్సి ఉందని, అది కూడా రూ.26లక్షల లోపే ఉందని సమాధానమిచ్చారు. ఏప్రిల్‌ 1వతేదీలోపు బకాయిలు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ చెప్పి వెళ్లిపోయారు.

మరో తలపోటుగా పన్నుల భారం
స్కిట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవు. మొన్నటి వరకు స్కిట్‌ను అనంతపురం జేఎన్‌టీయూకి, కర్ణాటకలోని మఠాలకు లీజుకు ఇవ్వనున్నట్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాలతో లీజుపై స్కిట్‌ యాజమాన్యం వెనక్కు తగ్గింది. ఈనేపథ్యంలో మున్సిపాలిటి పన్నుల భారం కళాశాల యాజమాన్యానికి మరో తలపోటుగా పరిణమించింది.

మరిన్ని వార్తలు