నగరంలో వర్షం

30 Aug, 2016 21:06 IST|Sakshi
నగరంలో వర్షం

సాక్షి,సిటీబ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. షాపూర్‌ నగర్‌లో అత్యధికంగా 1.5 సెం.మీ, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మాదాపూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ ప్రాంతాల్లో ఒక సెంటీమీటర్‌ వర్షపాతం నమోదైంది.

సాయంత్రం వేళ వర్షం కురియడంతో కోఠి, అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, పంజగుట్ట, అమీర్‌పేట్,ఎస్‌.ఆర్‌.నగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మెహిదీపట్నం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్‌ స్తంభించింది. ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకొని వాహనదారులు, ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు అవస్థలు పడ్డారు. రాత్రి ఆలస్యంగా ఇళ్లకు చేరుకోవాల్సి వచ్చింది.  

 

మరిన్ని వార్తలు