కోర్టు ఆదేశాలతో ‘స్మార్ట్‌సిటీ’పై కదలిక

11 Nov, 2016 23:39 IST|Sakshi
  •  పీఎంసీ నియామకం కోసం కసరత్తు ∙
  • వాడియా, ఆర్‌వీ కన్సల్టెంట్లతో చర్చలు
  • కాకినాడ : 
    కోర్టు ఆదేశాలతో నిలిచిపోయిన కాకినాడ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ(పీఎంసీ) నియామకంపై మళ్ళీ కదలిక వచ్చింది. పీఎంసీ కోసం ఆర్‌వీ కన్సల్టెంట్స్, వాడియా సంస్థలు తీవ్రంగా పోటీపడి చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కొద్దినెలలుగా ప్రతిష్టం బన నెలకొంది. స్మార్ట్‌సిటీలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి ప్రాజెక్టు నివేదికలు, పనుల పర్యవేక్షణ సహా అన్ని అంశాలను పర్యవేక్షించేందుకు గతంలో టెండర్లు పిలిచారు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చివరకు ఆర్‌వీ కన్సల్టెంట్స్‌ను పీఎంసీకి ఎంపిక చేయాలని స్మార్ట్‌సిటీ కార్పొరేష¯ŒS ఎవాల్యూష¯ŒS కమిటీ నిర్ధారణకు వచ్చింది. వీరితో పోటీపడ్డ వాడియా సంస్థ ఆర్‌వీ కన్సల్టెంట్స్‌ ఆర్హతలను ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎంపిక ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కేసును పరిశీలించిన న్యాయస్థానం ఇరు సంస్థలతోనూ ఎవాల్యూష¯ŒS కమిటీ సమావేశమై చర్చలు ద్వారా పరిష్కరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యలో శుక్రవారం స్మార్ట్‌సిటీ కార్పొరేష¯ŒS ఎండీ, కమిషనర్‌ అలీమబాషా సమక్షంలో ఇందుకు సంబంధించి ఇరు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయా సంస్థల వాదనలు విన్నారు. అనంతరం కమిషనర్‌ అలీమ్‌బాషా నగరపాలక సంస్థ అధికారులతోనూ సమావేశమై తదుపరి చర్యలపై సమీక్షించారు. ఎంపిక ప్రక్రియపై రాత్రి వరకూ అధికారులు ఓ నిర్ణయానికి రాలేదు. దీనిపై అధికారులు తుది నిర్ణయం తీసుకుని పీఎంసీ కోసం సంస్థను ఎంపిక చేస్తే స్మార్ట్‌సిటీ పనులను వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది.  
     
మరిన్ని వార్తలు