ఎన్యూమరేటర్లపై దాడి

26 Aug, 2016 21:39 IST|Sakshi
 
 
నెల్లూరు(పొగతోట):
ప్రజా సాధికార సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లపై నెల్లూరు బాలాజీనగర్‌ ప్రజలు కొందరు దాడి చేశారని, దీంతో సర్వే నిలిపివేశామని బాధితులు శుక్రవారం జేసీ ఇంతియాజ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌వీఆర్‌సీ శేఖర్‌రావు మాట్లాడుతూ ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేని కారణంగా ఎన్యూమరేటర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారను. బాలజీనగర్‌లో సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లు ఐడీ పత్రాలు చూపించండని, కులం చెప్పమని స్థానికులను అడిగితే మీకేందుకు చెప్పాలని ప్రజలు సిబ్బందిని ఎదురు ప్రశ్నిస్తున్నారన్నారు. దీంతో సర్వే చేయడానికి ఎన్యూమరేటర్ల భయపడుతున్నారన్నారు. సర్వేపై ప్రజల్లో ఉన్న అపోహలను పొగోట్టేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటోలో ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని జేసీ ఎన్యూమరేటర్లకు తెలిపారు. సర్వే నిలిపివేయకుండా కొనసాగించాలని ఎన్యూమరేటర్లకు సూచించారు.
 
 
మరిన్ని వార్తలు