ప్రజాసాధికార సర్వే పురోగతిపై సమీక్ష

21 Sep, 2016 23:10 IST|Sakshi
కాకినాడ సిటీ : రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేట జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లతో బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ప్రజాసాధికార సర్వే పురోగతిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ సర్వే ప్రక్రియను ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే చేసిన గృహాలకు డిజిటల్‌ ఇంటి నంబర్లు జారీ చేసేందుకు వాటి ముందు ఉన్న వీధుల జీపీఆర్‌ఎస్‌ వివరాలను సేకరించి అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. అసంపూర్తి, అసంబద్ధ డేటాను సరిచేసేందుకు ప్రత్యేక అప్‌ రూపొందించామని, దీనితో సత్వరం సవరణలు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ పాల్గొంటూ జిల్లాలో 68 శాతం సర్వే పూర్తి చేశామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌–2 రాధాకృష్ణమూర్తి, ఎన్‌ఐసీ సైంటిస్ట్‌ ఉస్మాన్, హెచ్‌ సూపరింటెండెంట్‌ రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు