ఇంటిలోనే పాముల పుట్టలు

5 Sep, 2017 11:07 IST|Sakshi
ఇంటిలోనే పాముల పుట్టలు
సాలూరురూరల్(ఒడిశా)‌: పొలం గట్లపై పాముల పుట్టలు ఉంటేనే అటువైపుగా వెళ్లేందుకు భయపడతాం.. దూరంగా నడుస్తాం.. అలాంటిది మండలంలోని గాంజాయిభద్ర పంచాయతీ పరిధిలోని పనుకులోవలో ఓ ఇంటిలోనే పాములు పుట్టలు కనిపిస్తాయి. అందులో నాగవేవత(నాగుపాము) ఉంటుందని నమ్ముతారు. నిత్యం ఇంటిలోనే పుట్టలకు పూజలు చేస్తారు. పుట్టలో పాలుపోస్తారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినా, ఏ కార్యం జరగాలన్నా నాగమ్మను కొలుచుకుని బయటకు వెళ్తారు. ఉదయం వేళల్లో ఇంటి పెడకలో, సమీప అడవిలోకి నాగమ్మ వెళ్తుందని,  రాత్రి వేళల్లో పుట్టలోకి రావడం, లేదంటే ఇంటిలో ఏదైనా ఓ స్థలంలో మండివేసి ఉంటుందని ఇంటి యజమాని కనుపూరి చెప్పారు.

నాగమ్మ(పాము) ఎదురైనా నెమ్మదిగా వెళ్లిపోతుందని, ఎవ్వరికి ఏ హాని చేయదని చెబుతున్నారు. అనాదిగా ఇంటిలో పుట్టలు ఉన్నాయని, అందులో నాగమ్మ ఉంటుందని, ఇప్పటి వరకు ఎవ్వరికి ఏ హాని చేయలేదని తెలుపుతున్నారు. చాలా పెద్ద నాగదేవత ఉన్న ఈ పుట్టకు గ్రామస్తులంతా వచ్చి పూజలు చేస్తుంటారు. స్థానికంగా నిర్మించిన వాటర్‌ట్యాంకును పరిశీలించేందుకు గ్రామానికి వచ్చిన ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ గాయత్రిదేవి ఇంటిలోని పుట్టలను చూసి ఆశ్చర్యపోయారు. 
 
మా ఇంటి దైవం
నాగమ్మను మా ఇంటి దైవంగా కొలుస్తున్నాం. నాగమ్మ ఎవ్వరికీ హాని చేయదు. గ్రామస్తులంతా నాగమ్మకు పూజచేసి పనులకు వెళ్తారు. ఉదయం వేళల్లో ఇంటి పెనకలో, సమీప అడవిలోకి నాగమ్మ  వెళ్తుంది. రాత్రి వేళల్లో ఇంటిలోని పుట్టలోకి చేరుతుంది.  –మజ్జి కనుపూరి, గ్రామస్తుడు  
మరిన్ని వార్తలు