స్నో'యగం'

14 Oct, 2016 15:47 IST|Sakshi
స్నో'యగం'

పాడేరు రూరల్‌/ విశాఖపట్నం:
ఏజెన్సీలో ముందస్తుగా చలిగాలులు వ్యాపిస్తున్నాయి. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు మన్యంలో చలిగాలులు విజృంభిస్తాయి, పొగమంచు దట్టంగా కురుస్తుంది. అయితే బుధవారం సాయంత్రం నుంచే మన్యంలో చలిగాలులు ప్రారంభమయ్యాయి. రాత్రంతా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలను చలి వణికించింది. గురువారం తెల్లవారుజాము నుంచి పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 8గంటల వరకు మంచు తెరలు వీడలేదు. వాహన చోదకులు లైట్లు వేసుకునే వాహనాలను నడిపారు. మన్యాన్ని మంచు కమ్ముకోవడంతో సాలెగూడులు మంచు బిందువులతో ఆకర్షించాయి.  

గురువారం వేకువజామున 4 గంటల నుంచే అన్ని ప్రాంతాల్లో మంచు దుప్పటి పరుచుకుంది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. కొంతమంది గిరిజనులు చలిమంటలు కాగుతూ ఉపశమనం పొందారు. సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉన్న పర్యాటక ప్రదేశమైన మండలంలోని డల్లాపల్లి ప్రాంతంలో 14డిగ్రీలు, మోదకొండమ్మ అమ్మవారి పాదాలులో 16డిగ్రీలు, మినుములూరు కాఫీ పరి«శోధన కేంద్రంలో 17 డిగ్రీలు, పాడేరు పరిసర ప్రాంతాల్లో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  గురువారం సాయంత్రం 4గంటల నుంచే చలిగాలులు వేయడంతో ముందస్తుగానే చలికాలం ప్రారంభమైందని గిరిజనులు వాఖ్యానిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు