విద్యతోనే సామాజిక మార్పు

31 Jul, 2016 17:34 IST|Sakshi
విద్యతోనే సామాజిక మార్పు

పరిగి: విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. పరిగిలోని అంబేద్కర్‌, జగ్జీవన్‌రాం విగ్రహాలకు ఆదివారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే పేదరికం నుంచి బయటపడతారని ప్రత్యామ్నాయ మార్గం లేదని తెలపారు. అట్టడుగు వర్గాల పిల్లలందరూ బడుల్లో ఉండేలా విద్యావంతులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌, డిప్యూటీ ఈఓ హరిశ్చందర్‌, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు వెంకటయ్య, చంద్రయ్య, శ్రీనివాస్‌, రవికుమార్‌, శ్రీనివాస్‌, శ్రీను, బుగ్గయ్య, బిచ్చయ్య, గోపాల్‌, వెంకటయ్య, చందు తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థుల కోసం విజ్ఞాన కేంద్రాలు
దోమ: విజ్ఞాన కేంద్రాలు పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్నట్లు సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల రాష్ర్ట కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ తెలిపారు. దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో స్వేరోస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్‌ విజ్ఞాన మందిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పుట్టుకతోనే గొప్పవాడు కాదని మంచి చదువు ఉన్న వారు ఎప్పుడైన, ఎక్కడైనా సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు మంచి పుస్తకాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటుండడంతో విజ్ఞాన మందిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంచి జ్ఞానం సంపాదించి విద్యార్థులు ఐఏఎస్‌, ఐపీఎస్‌ స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీటీఓ రాంచందర్‌, డిప్యూటీ ఈఓ హరిశ్చందర్, జెడ్పీటీసీ సభ్యురాలు సరోజ, పశ్చిమ రంగారెడ్డి జిల్లా స్వేరోస్‌ అధ్యక్షుడు ఆనందం, కార్యదర్శి బాబూరావు, మండల అధ్యక్షుడు యాదయ్య, దిర్సంపల్లి అంబేద్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, కార్యదర్శి నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు