సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఔదార్యం

7 Sep, 2016 22:08 IST|Sakshi
  • కాలేయం వ్యాధితో బాధపడుతున్న మహిళకు రూ.10వేలు సాయం 
  • ధర్మపురి : కాలేయం వ్యాధితో బాధపడుతున్న ఓ నిరుపేద మహిళ దీనగాథను ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ ద్వారా తెలుసుకున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బాధితురాలికి రూ.10వేలు సాయం అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ధర్మపురిలోని న్యూ హరిజ కాలనీకి చెందిన బత్తిని అంజవ్వ తండ్రి చిన్నతనంలో మృతి చెందాడు. తల్లి నర్సమ్మ వృద్ధురాలు. అంజవ్వకు వివాహమైన సంవత్సరం లోపే విడాకులయ్యాయి. ఆమె కొంతకాలం నుంచి కాలేయం వ్యాధితో బాధపడుతోంది. వైద్యం చేయించుకునే స్తోమత లేక నిత్యం నరకం అనుభవిస్తోంది. అంజవ్వ బాధను చూసిన ధర్మపురికి చెందిన రేణికుంట రమేష్‌ ఆమెకు వైద్యసహాయం కోసం దాతలు సాయమందించాలని కోరుతూ ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ చేశాడు. ఇది చూసిన నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వినయ్‌ రూ.10వేలను అంజవ్వ బ్యాంకు ఖాతాలో జమచేశాడు. వినయ్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.  
మరిన్ని వార్తలు