‘పిండే’యడమే ‘ప్రధానం’

19 Jul, 2015 10:59 IST|Sakshi
‘పిండే’యడమే ‘ప్రధానం’

రాజమండ్రి/కొవ్వూరు: ఎడారిలో సైతం ఇసుకను అమ్మే నైపుణ్యం కొందరు వ్యాపారుల సొంతం. అలాంటివారు పుష్కరాల వంటి మహదవకాశాన్ని వదులుకుంటారా! అందుకే గడ్డి పరకకు, వరి పిండికి కూడా అడ్డగోలుగా ధరలు నిర్ణయించేసి భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పుష్కరాల్లో పిండ ప్రదానాల నిర్వహణకు అవసరమైన దర్భగడ్డి, వరి పిండి అమ్మకాలతో భారీగా ఆర్జిస్తూ భక్తుల నమ్మకాన్ని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. భక్తులు పితృదేవతలకు పిండాలు సమర్పించే వస్తువులకు భారీగా వసూళ్లు చేస్తున్నప్పటికీ కార్యక్రమం నిర్వహించేందుకు ఖర్చులు భరిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు