ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

27 Sep, 2016 23:19 IST|Sakshi
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కోదాడఅర్బన్‌: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కోదాడ ఆర్టీసీ డిపో గేటు  ఎదుట టీఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీలో టిమ్స్‌ సర్వీసులు రద్దు చేయాలని, పెంచిన కిలోమీటర్లు తగ్గించాలని, గ్యారేజీలకు మరమ్మతులు నిర్వహించాలని కోరారు. లేని పక్షంలో తమ ఆందోళలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌ఎస్‌గౌడ్, కేవీరావు, డిఆర్‌ దాస్,బీఎస్‌ నారాయణ, పీ.సైదులు తదితరులు పాల్గొన్నారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు