సోమశిలకు 2206 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

16 Aug, 2016 23:01 IST|Sakshi
సోమశిలకు 2206 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సోమశిల: రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల సోమశిల జలాశయానికి మంగళవారం ఉదయానికి 2206 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 9.383 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి పెన్నార్‌ డెల్టాకు 3000 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 83.390 మీటర్లు, 273.59 అడుగుల మట్టం నమోదైంది. సగటున 74 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది.
కండలేరులో 
రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 23.553 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ సురేష్‌ తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 200, పిన్నెరువాగుకి 5, మొదటి బ్రాంచ్‌ కెనాల్‌కు30, లోలెవల్‌ స్లూయీస్‌కు 30 క్యూసెక్కులు వంతున నీరు  విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు.
 
మరిన్ని వార్తలు