కొన్ని మార్పులు

19 Aug, 2016 23:42 IST|Sakshi
కొన్ని మార్పులు
  • జిల్లాల పునర్విభన ముసాయిదాకు తుదిరూపు
  • వరంగల్, హన్మకొండలో 14 చొప్పున మండలాలు
  • హన్మకొండ జిల్లాలోకి పాలకుర్తి, కొడకండ్ల 
  • జయశంకర్‌ జిల్లాలోకి శాయంపేట
  • మహబూబాబాద్‌లోనే కొత్తగూడ
  • కొత్తగా  హన్మకొండ, భూపాలపల్లి, హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లు
  • సాక్షిప్రతినిధి, వరంగల్‌ : అన్ని వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్న జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరింది. శనివారం హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో జిల్లాల పునర్విభజనపై ముసాయిదా సిద్ధమైంది. జిల్లాలతోపాటు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా ప్రతిపాదనలు రూపొందించారు. వరంగల్‌ జిల్లాను వరంగల్, హన్మకొండ, ఆచార్య జయశంకర్, మహబూబాబాద్‌ జిల్లాలుగా విభజించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తుది ముసాయిదాలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.
     
    16 మండలాలతో వరంగల్‌ జిల్లాను, 12 మండలాలతో హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయాలని మొదట ప్రతిపాదనలు చేశారు. తాజా మార్పుల ప్రకారం... వరంగల్, హన్మకొండ జిల్లాల్లో 14 చొప్పున మండలాలు ఉంటున్నాయి. ఆచార్య జయశంకర్‌(భూపాలపల్లి), మహబూబాబాద్‌ జిల్లాలోని మండలాల సంఖ్యలో మార్పేమీ జరగలేదు. తాజా ప్రతిపాదన ప్రకారం శాయంపేట మండలం ఆచార్య జయశంకర్‌ జిల్లాలో కలవనుంది. వరంగల్‌ జిల్లాలో కొనసాగించాలని ఆ మండల ప్రజలు పోరాటాలు చేసినా ప్రతిపాదనల్లో మాత్రం దీనికి విరుద్ధంగానే ఉంది. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల మండలాలను హన్మకొండ జిల్లాలో కలిపేలా, రాయపర్తి మండలాన్ని వరంగల్‌ జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్తగూడ మండలాన్ని మొదట పేర్కొనట్లుగా మహబూబాబాద్‌ జిల్లాలోనే కలపనున్నారు. 
     
    జిల్లాల వారీగా మండలాలు...
     
    వరంగల్‌ జిల్లా : వరంగల్, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, రాయపర్తి.
     
    హన్మకొండ జిల్లా : హన్మకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, కొడకండ్ల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపురం.
     
    ఆచార్య జయశంకర్‌ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, గణపురం, రేగొండ, శాయంపేట, మొగుళ్లపల్లి, కాటారం, మహదేవపూర్, మల్హర్‌రావు, మహాముత్తారం, ఏటూరునాగారం, గోవిందరావుపేట, మంగపేట, ములుగు, తాడ్వాయి, వెంకటాపురం.
     
    మహబూబాబాద్‌ : డోర్నకల్, కేసముద్రం, కురవి, మహబూబాబాద్, మరిపెడ, నర్సింహులపేట, నెల్లికుదురు, తొర్రూరు, గూడురు, కొత్తగూడ, బయ్యారం, గార్ల.
     
    యాదాద్రి జిల్లా : జనగామ, లింగాలగణపురం, దేవరుప్పుల, బచ్చన్నపేట.
    సిద్ధిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు.
     
    కొత్త రెవెన్యూ డివిజన్లు ఇలా..
    ప్రతిపాదిత నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటవుతున్నాయి. భూపాలపల్లిని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల క్రితమే ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూపాలపల్లి కేంద్రంగా ఆచార్య జయశంకర్‌ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. దీంతో భూపాలపల్లి రెవెన్యూ డివిజన్‌ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంటోంది. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటును ముసాయిదాలో పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న హన్మకొండ జిల్లాలో హన్మకొండ, హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానున్నాయి.
     
    రెవెన్యూ డివిజన్ల వారీగా మండలాలు...
    నర్సంపేట :  నెక్కొండ, పరకాల, చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నల్లబెల్లి, నర్సంపేట.
    వరంగల్‌ : ఆత్మకూరు, గీసుగొండ, పర్వతగిరి, రాయపర్తి, సంగెం, వరంగల్, వర్ధన్నపేట.
    హుజూరాబాద్‌ : భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపురం.
    హన్మకొండ : రఘునాథపల్లి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండ, హసన్‌పర్తి, జఫర్‌గఢ్, కొడకండ్ల, పాలకుర్తి, నర్మెట.
    భూపాలపల్లి : కాటారం, మహదేవపూర్, మల్హర్‌రావు, మహాముత్తారం, భూపాలపల్లి, చిట్యాల, గణపురం, రేగొండ, శాయంపేట, మొగుళ్లపల్లి.
    ములుగు : ఏటూరునాగారం, గోవిందరావుపేట, మంగపేట, ములుగు, తాడ్వాయి, వెంకటాపురం.
    మహబూబాబాద్‌ : బయ్యారం, గార్ల, డోర్నకల్, కేసముద్రం, కురవి, మహబూబాబాద్, మరిపెడ, నర్సింహులపేట, నెల్లికుదురు, తొర్రూరు, గూడురు, కొత్తగూడ.
    జనగామ : జనగామ, లింగాలగణపురం, దేవరుప్పుల, బచ్చన్నపేట, ఆలేరు, గుండాల, మోటకొండూరు(న్యూ), రాజాపేట, అడ్డగూడురు(న్యూ), మోత్కూరు.
మరిన్ని వార్తలు