సరుకు రవాణాపై ప్రత్యేక దృష్టి

30 Sep, 2016 23:23 IST|Sakshi
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఆర్టీసీలో సరుకు రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసి దాని ద్వారా మరింత ఆదాయం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆ సంస్థ మార్కెటింగ్‌ అండ్‌ కమర్షియల్‌  చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ కె.గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయంలో ఆయన జిల్లాలోని 8 డిపోలకు చెందిన రవాణా విభాగ అసిస్టెంట్‌ డిపో క్లర్క్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరుకు రవాణా వ్యవస్థ ద్వారా మూడు నెలల్లో పశ్చిమ గోదావరి రీజియన్‌లో రూ.19 లక్షల ఆదాయం పొందినట్టు చెప్పారు. సరుకు రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించి మరింత ఆదాయం తీసుకురావడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ ఎస్‌.ధనుంజయరావు, మార్కెటింగ్‌ అండ్‌ కమర్షియల్‌ డెప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ జీఎస్‌ఆర్‌కే మూర్తి, ఏటీఎం కమర్షియల్‌ సి.శివరామ్‌ పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు