గంజాయి అక్రమ రవాణాపై నిఘా

10 Sep, 2016 00:22 IST|Sakshi
ఎకై్సజ్‌ డెప్యూటీ కమిషనర్‌ వై.బి.భాస్కరరావు
చింతలపూడి : జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై నిఘాను పెంచినట్లు ఎకై్సజ్‌ డెప్యూటీ కమిషనర్‌ వైబి భాస్కరరావు తెలిపారు. చింతలపూడి ఎకై్సజ్‌ సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గంజాయి రవాణా నిరోధానికి నాలుగు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 65 మంది కానిస్టేబుళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరికల్లా వీరి శిక్షణ పూర్తవుతుందని చెప్పారు. అలాగే హైవేలలో రోడ్డు పక్కన ఉన్న మద్యం దుకాణాలను అక్కడి నుంచి మార్చడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో తమ దాడుల్లో పట్టుబడిన 600 వాహనాలను వేలం వేయగా సుమారు రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. సారా తయారీకి వినియోగించే ముడి పదార్థాలు విక్రయించే వారిపై పిడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో డిప్యూటీ కమీషనర్‌ కార్యాలయంతోపాటు రెండు ఎకై్సజ్‌ సూపరింటెండెంట్‌  కార్యాలయాలు, 13 సర్కిల్‌ కార్యాలయాలు ఉన్నాయని వివరించారు. అన్ని కార్యాలయాల్లో కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
 
మరిన్ని వార్తలు