గీసుకొండ జాతర ప్రారంభం

13 Jan, 2017 01:47 IST|Sakshi
గీసుకొండ జాతర ప్రారంభం

నేడు రేపు ప్రత్యేక పూజలు
బౌద్ధం వర్ధిల్లినట్లుగా చారిత్రక ఆధారాలు


గీసుకొండ(పరకాల): మండల కేంద్రమైన గీసుకొండ గ్రామ శివారులోని గుట్టపై స్వయంభువగా వెలసిన లక్ష్మినర్సింహస్వామి జాతర శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో  ఈ నెల 10న స్వామి వారిని గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆల యం నుంచి గుట్టపైకి  తీసుకు వచ్చారు.  గురువారం రాత్రి నుంచి జాత ర ప్రారంభమైందని, శుక్ర, శనివారాల్లో కొనసాగుతుందని నిర్వహణ కమిటీ బాధ్యులు తెలిపారు. శనివారం సాయంత్రం స్వామివారిని   గ్రామానికి తోడ్కొని వెళ్లనున్నారు.

స్వామివారి గుట్టకు చారిత్రక ప్రాధాన్యం..
స్వామివారు వెలసిన నల్లని కొండను  గీసుకొండ గుట్ట అని పిలుస్తారు. ఈ గుట్ట నలుపు రంగులో ఉండటంతో ‘గీసు అనగా నలుపు అని, నల్లని కొండ శివారులో వెలసిన గ్రా మం కావడంతో గీసుకొండ అని పేరు వచ్చిందని చెబుతా రు. అలాగే ఆదిమానవులు శిలాయుగంలో గుట్ట ప్రాంత ంలో జీవించేవారిని, వారి తర్వాత శాతవాహనుల వరకు నాగరికత వెలసినట్లు, బౌద్ధం ఇక్కడ వర్ధిల్లినట్లు చారిత్రక ఆధారాలు పురావస్తు శాఖ తవ్వకాల్లో బయల్ప డ్డాయి.

గుట్ట వద్ద పురావస్తుశాఖ వారు చేపట్టిన తవ్వకాల్లో బయల్పడ్డ టెర్రాకోట బొమ్మలు, బుద్దుడి ప్రతిమ, రాతి ఆయుధాలను వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెనకవైపు ఉన్న పురావస్తుశాఖ మ్యూజియంలో భద్రపరిచారు. ఆది మానువులు తమ రాతి ఆయుధాలను పదును చేయడానికి గుట్టపై నూరా(గీశా) రని, అందుకే ఈ కొండకు ‘గీసుడుకొండ’అని పేరు వచ్చిందని ఆ పేరుతోనే గ్రామానికి గీసుకొండ అని పేరు పెట్టి ఉంటారనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులేవీ కేటాయించకపోవడం, ప్రచారం కొరవడటంతో ప్రాశస్త్యం మరుగున పడుతోంది.

మరిన్ని వార్తలు