తెలంగాణ జాగృతి జిల్లా శాఖకు అవార్డు

9 Aug, 2016 00:06 IST|Sakshi
హన్మకొండ : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గోదావరి పుష్కరాలు, మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలోను వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేయడంతో పాటు వలంటీర్లుగా సేవలు అందించారు. సేవలను గుర్తించిన తెలంగాణ జాగృతి ఆధినాయకత్వం వరంగల్‌ జిల్లా శాఖకు బెస్ట్‌ జిల్లా శాఖగా ఎంపిక చేసి ఆవార్డు అందించింది. వరంగల్‌ జిల్లా శాఖ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందు వరుసలో ఉంది.  నల్లగొండలో జరిగిన 10 వార్షికోత్సవ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జిల్లా కన్వీనర్‌ కోరబోయిన విజయ్‌కుమార్‌ అవార్డు అందుకున్నారు. దీంతో పాటు సలాం పోలీసు లఘుచిత్రా దర్శకుడు వంశీకి ప్రోత్సాహక అవార్డుకు వచ్చింది. జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కుట్టు మిషన్‌ శిక్షణ ఇస్తున్న రాణి,లతకు ప్రోత్సాహక అవార్డు లభించింది.  ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాకు ఉత్తమ అవార్డు రావడానికి కృషి చేసిన జాగృతి అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.  
మరిన్ని వార్తలు