క్రీడలతో కీర్తి ప్రతిష్టలు

8 Jan, 2017 21:11 IST|Sakshi
క్రీడలతో కీర్తి ప్రతిష్టలు
- ఐఆర్‌ఎఈఫ్‌ అధినేత బిషప్‌ డాక్టర్‌ ఇమ్మానియేలురెబ్బా
 
రేపల్లె : క్రీడలతో దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించేందుకు కృషిచేస్తున్నట్లు ఐఆర్‌ఈఎఫ్‌ అధినేత బిషప్‌ డాక్టర్‌ ఇమ్మానియేలురెబ్బా చెప్పారు. తహసీల్దార్‌ కార్యాలయ సమీపంలో యార్లగడ్డ శ్రీకృష్ణ మోహనరావు (వైఎస్‌కే) జ్ఞాపకార్థం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ గుంటూరు ఎలైట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడా పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రీడల్లో రాణించిన వారికి ఎప్పుడూ మంచి భవిష్యత్‌ ఉంటుందని చెప్పారు. ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు కోడే గేరీశంకర్‌ మాట్లాడుతూ సింధు, సైనా నెహ్వాల్, శ్రీకాంత్‌ వంటి క్రీడాకారులను ఎంతో సాధన చేస్తే ఈ రోజు ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ గుంటూరు ఎలైట్‌ అధ్యక్షుడు దాసరి శివప్రసాద్, జనసేన నియోజకవర్గ సెక్రటరీ నల్లూరి వాసుదేవ్, లయన్స్‌క్లబ్‌ జిల్లా పీఆర్వో కే.విజయ్‌చంద్, క్లబ్‌ క్యాబినెట్‌ కే.నగేష్, ఎన్‌ఏయుపి స్కూలు మేనేజర్‌ దాసరి బాబూరావు, లయన్స్‌క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ చైర్మన్‌ దాసరి స్వతంత్రప్రసాద్, సీపీఐ ఏరియా కార్యదర్శి కన్నెగంటి రమేష్, కమిటీ మెంబర్లు కిషోర్, కే.శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.
 
విజేతలు వీరే...
ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడా పోటీలలో పురుషుల విభాగంలో మీడియా విజన్‌(వైజాగ్‌) ప్రథమస్థానంలో నిలవగా, ఆదికవి నన్నయ్య యూనివర్శిటి(రాజమండ్రి) టీమ్‌ ద్వితీయస్తానంలో నిలిచింది. అదేవిధంగా రేపల్లె వైఎస్‌కే మోమోరియల్‌ టీమ్, నూజువీడు టీమ్‌లు తృతీయ, చతుర్ధస్థానాలలో నిలిచాయి. మహిళల విభాగంలో విశాఖపట్నం టీమ్‌ ప్రధమస్థానంలో నిలవగా, మచిలీపట్నం టీమ్‌ ద్వితీయస్థానంలో, బిక్కవోలు టీమ్‌ తృతీయస్థానంలో, రేపల్లె ఆర్‌సీ కళాశాల నాల్గవస్థానంలో నిలిచాయి. పురుషులు బెస్ట్‌ప్లేయర్స్‌గా వి.శ్యామ్‌(వైజాగ్‌), సిహెచ్‌ విజయ్‌(ఆదికవి నన్నయ్య యూనివర్శిటి టీమ్‌), ఎం.సురేష్‌(నూజివీడు), ఎ.నీలాద్రి(రేపల్లె), ఎం.కన్నా (మచిలీపట్నం)లు నిలవగా, మహిళల విభాగంలో బెస్ట్‌ ప్లేయర్స్‌గా బి.రేవతి(బిక్కవోలు), డి.వాణి (ఆచార్య నాగార్జున యూనివర్శిటి టీమ్‌), టి.చాందిని(రేపల్లె ఆర్‌సీ కళాశాల) నిలిచారు. టోర్నమెంట్‌ ఆఫ్‌ బెస్ట్‌ ప్లేయర్‌గా కే.శ్రావణి(వైజాగ్‌) నిలిచింది. వీరిని పలువురు అభినందించారు.
మరిన్ని వార్తలు