‘సెడ్స్’ సేవలు అభినందనీయం

12 Dec, 2016 14:55 IST|Sakshi
‘సెడ్స్’ సేవలు అభినందనీయం

జిల్లా విద్యాధికారి లింగయ్య
ఘనంగా స్పోర్ట్స్ మీట్    
పాల్గొన్న విదేశీయులు

గుడిహత్నూర్ : సెడ్స్ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని జిల్లా విద్యాధికారి లింగయ్య అన్నారు. మండలంలోని కొల్హారీ ప్రాథమికోన్నత పాఠశాలలో సెడ్స్  ఆధ్వర్యంలో ప్లాన్ ఇండియా, పర్ఫాం సంస్థల సహకారంతో మంగళవారం నిర్వహించిన వార్షిక క్రీడా సంబరాల్లో ఆయన మాట్లాడారు.  మండలంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, పిల్లల అభివృద్ధికి సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. క్రీడాలతో విద్యార్థులను ఆకర్షించి మరింత ప్రోత్సాహాన్ని అందించే దిశగా తాము కృషి చేస్తున్నట్లు సంస్థ డెరైక్టర్ ఆర్.సురేందర్ తెలిపారు. స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న వృధ్ధుల ఆశ్రమం, యువజనులకు స్వయం ఉపాధి శిక్షణలు, బాల కార్మికుల నిర్మూలన, క్రీడల్లో ప్రోత్సాహం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమానికి లండన్‌కు చెందిన ప్లాన్ ఇండియా, పర్ఫాం ప్రతినిధులు మైఖేల్ రాబర్ట్, ఫ్లోరియన్ డెడైరిసన్, ల్యూక్‌లాక్, జోసీ పార్మీ, జెసీ జోయ్‌లతో పాటు ప్లాన్ ఇండియా తెలుగు రాష్ట్రాల ప్రోగ్రాం అధికారి కె.అభిలాష్ పాల్గొని సంస్థ సేవలు పరిశీలించారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనపర్చిన జట్లకు బహుమతులు అందజేశారు. స్థానిక సర్పంచ్ బా లాజీ సోంటక్కే, ఎస్‌ఎంసీ చైర్మన్ తగ్రే ప్రకాశ్, ఎంఈవో నారాయణ, సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ తిరుపతి, వివిధ గ్రామాల వలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు