హోరాహోరీగా క్రీడాపోటీలు

3 Nov, 2016 01:31 IST|Sakshi
హోరాహోరీగా క్రీడాపోటీలు
డక్కిలి: డక్కిలి గురుకుల పాఠశాల, కళాశాల క్రీడా ప్రాంగణంలో బుధవారం గుంటూరు జోనల్‌ స్థాయి మూడో జోన్‌ గురుకుల పాఠశాల, కళాశాలల పోటీలు హోరాహోరీగా సాగాయి. పలు క్రీడా పోటీల్లో విద్యార్థులు పోటాపోటీగా ఆడారు. ఉదయం 7 నుంచి 11 గంటలు వరకు పోటీలు జరిగాయి. అనంతరం వర్షం జోరుగా కురవడంతో సాయంత్రం ప్రారంభమైన క్రీడా పోటీలు రాత్రి ఏడు గంటలు వరుకు సాగాయి. సీనియర్‌ హైజంప్‌ విభాగంలో సుప్రియ (నాగులపాళెం, ప్రకాశం జిల్లా), దీపిక (నాగులపాళెం, ప్రకాశం జిల్లా), రేవతి (పుదూరు) గెలుపొందారు. ట్రిపుల్‌ జంప్‌ విభాగంలో సుప్రజ (అద్దంకి, ప్రకాశం జిల్లా), తనుజా (సంగం), సంధ్య (ముత్తుకూరు), వాలీబాల్‌ సీనియర్స్‌ విభాగంలో కండలేరు – అమరావతి మధ్య జరిగిన పోరులో అమరావతి విజయం సాధించింది. 
  • నాగార్జునసాగర్‌–సూళ్లూరుపేట మధ్య జరిగిన పోటీల్లో నాగార్జునసాగర్‌ గెలిచింది. వినుకొండ – కొత్తకోడూరు జరిగిన మధ్య పోటీల్లో వినుకొండ విజయం పొందింది. 
  • పెద్దపావని – చీమకుర్తి మధ్య జరిగిన పోటీల్లో  పెద్దపావని జట్టు గెలుపొందింది. ఖోఖో జూనియర్స్‌ విభాగంలో ఉప్పలపాడు – ఆర్కేపురం మధ్య జరిగిన పోటీల్లో ఆర్కేపురం గెలిచింది. 
  •  సీనియర్స్‌ ఖోఖో విభాగంలో ముత్తుకూరు – నాగార్జునసాగర్‌ మధ్య జరిగిన పోటీల్లో నాగార్జునసాగర్‌ గెలుపొందింది. 
  • త్రోబాల్‌ జూనియర్‌ విభాగంలో కండలేరు – అమరావతి మధ్య జరిగిన పోటీల్లో కండలేరు జట్టు గెలుపొందింది. నాగార్జునసాగర్‌ – రాచర్ల మధ్య జరిగిన పోటీల్లో నాగార్జునసాగర్‌ గెలుపొందింది.
  • పెద్దపావని – పుదూరు మధ్య జరిగిన పోటీల్లో పుదూరు జట్టు గెలుపొందింది. వినుకొండ – నాగార్జునసాగర్‌ మధ్య జరిగిన పోటీల్లో వినుకొండ గెలుచింది. 
  • సింగరాయకొండ – సంగం మధ్య జరిగిన పోటీల్లో సంగం గెలుపొందింది. బోగోలు – కండలేరు జట్ల మధ్య జరిగిన పోటీల్లో కండలేరు జట్టు విజయం సాధించింది.
  • కబడ్డీ జూనియర్స్‌ విభాగంలో డక్కిలి – బోగోలు మధ్య జరిగిన పోటీల్లో డక్కిలి జట్టు గెలిచింది. సూళ్లూరుపేట – బుచ్చిరెడ్డిపాళెం జట్ల మధ్య జరిగిన పోటీల్లో సూళ్లూరుపేట జట్టు గెలిచింది. 
  • ఉప్పలపాడు – అమరావతి జట్ల మధ్య జరిగిన పోటీల్లో ఉప్పలపాడు గెలిచింది. పుదూరు–కొండెపి జట్ల మధ్య జరిగిన పోటీల్లో పుదూరు జట్టు గెలిచింది. 
  • కబడ్డీ సీనియర్స్‌ విభాగంలో రాచర్ల – బాపట్ల జట్ల మధ్య జరిగిన పోటీల్లో బాపట్ల జట్టు విజయం సాధించింది. సూళ్లూరుపేట – నాగులపాళెం జట్ల మధ్య జరిగిన పోటీల్లో సూళ్లూరుపేట జట్టు విజయం సాధించింది.
 
 
మరిన్ని వార్తలు