క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌

14 Oct, 2016 22:17 IST|Sakshi
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌
  • జిల్లా కబడ్డీ, టేబుల్‌ టెన్నిస్‌ జట్ల ఎంపిక
  •  
    వేళంగి(కరప):
    చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ప్రిన్సిపాల్‌ సత్తి వీరవెంకట సత్యనారాయణరెడ్డి అన్నారు. కరప మండలం వేళంగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క» డ్డీ, టేబుల్‌టెన్నిస్‌ జిల్లాజట్ల ఎంపిక ఆటల పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి ప్రణాళికాబద్ధంగా చదువుకుంటూ, ఆటలలో కూడా ప్రావీణ్యం సంపాదించాలని, అందుకు అనుగుణంగా శిక్షణ పొందాలన్నారు. జిల్లా స్కూలు గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–19 కార్యదర్శి వై.తాతబ్బాయి పర్యవేక్షణలో వివిధ కళాశాలల పీడీలు వి.సీతాపతిరావు, ఈవీవీ సత్యనారాయణ, పి.రత్నసామ్యూల్, పి.గంగాధర్‌రెడ్డి, జే.రఘరాం, సతీష్, టీ.వీరయ్యచౌదరి, రాష్ట్ర బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ కోశాధికారి గన్నమనేని చక్రవర్తిఎంపిక కమిటీ సభ్యులుగా వ్యహరించారు.
    జిల్లా క» డ్డీ బాలుర జట్టు
    టి.దుర్గాచంద్, కె.హరిబాబు, వి.ధనశేఖర్, పి.బాలసుబ్రమణ్యం, పి.ధర్మతేజ(కాకినాడ), కె.చక్రవర్తి, బి.అనిల్‌(సామర్లకోట), పి.భవానీప్రసాద్‌(కిర్లంపూడి), కె.ప్రసాద్‌(గొల్లపాలెం), ఎ.రాము(కొత్తపేట), ఎ.వీరబాబు(కాకినాడ), ఎస్‌.రాజేష్‌(రాజమహేంద్రవరం), జి.సేలంరాజు(పెద్దాపురం) 
    జిల్లా కబడ్డీ బాలికల జట్టు
    ఎన్‌.కావ్య, ఐ.సూర్యభవానీ(కాకినాడ), పి.జగదేశ్వరీదేవి, ఎంవీవీ సాయిలక్ష్మి(గొల్లపాలెం),  పి.ఐంద్రాణి(కాజులూరు), ఎన్‌.శిరీష(గోకవరం), ఎన్‌.నాగశ్రీదేవి(కిర్లంపూడి), కె.ఆకాంక్ష(వేళంగి), కె.రాణి, పి.జ్యోతి(రామచంద్రపురం), ఎస్‌.ఐశ్వర్య, డి.చంద్రకళ(ఆలమూరు), ఎన్‌.దీప్తి(రావులపాలెం) 
    జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ బాలుర విభాగంలో
    ఎండీ ఫిరోజ్, ఎం.బద్రీప్రకాష్‌(రాజమహేంద్రవరం), జి.కిశోర్, ఎం.వినోద్‌కుమార్‌(అమలాపురం), జి.వెంకటస్వామి(రామచంద్రపురం)
    టేబుల్‌టెన్నిస్‌ బాలికల విభాగంలో
    డి.సాయిదీక్షిత(తుని),  పీఎస్‌ఆర్‌ఎస్‌ సరాజిత, ఎం.ప్రజ్వల, పి.వైష్ణవి(కాకినాడ),  షేక్‌ జహీరా షిహార్‌(రామచంద్రపురం)
    జిల్లా జట్లకు ఎంపికైన ఈక్రీడాకారులు రాష్ట్ర స్థాయిపోటీలలో పాల్గొంటారని జిల్లాస్కూలు గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి తాతబ్బాయి తెలిపారు. హైస్కూల్‌ హెచ్‌ఎం బి.వెంకటశివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 
     
మరిన్ని వార్తలు