తారల తళుకులు.. మోడల్స్ మెరుపులు

29 Mar, 2016 02:00 IST|Sakshi
తారల తళుకులు.. మోడల్స్ మెరుపులు

సికింద్రాబాద్ పార్క్‌లేన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ’ ఇండియన్ వేర్ బ్రాండ్ షోరూంను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీతారలు అర్చన, పాయల్ ఘోష్.. మోడల్స్ శ్రేయ మిశ్రా, మిస్ ట్విన్ సిటీస్ సిమ్రత్, నిలోఫర్‌తో కలిసి షోరూమ్‌లో సందడి చేశారు. సమ్మర్ దుస్తులను ధరించి క్యాట్‌వాక్ చేస్తూ  అలరించారు. ప్రస్తుతం షోరూంలో 16 రకాల సమ్మర్ స్పెషల్ డ్రస్సులు అందుబాటులో ఉన్నాయని సంస్థ యజమాని సందీప్ కుమార్ తెలిపారు.   - సాక్షి, హైదరాబాద్

మరిన్ని వార్తలు