శ్రీమఠం హుండీ ఆదాయం రూ.1.02 కోట్లు

28 Dec, 2016 21:38 IST|Sakshi
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.1.02 కోట్లు
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి హుండీ లెక్కింపు బుధవారంతో రెండో రోజుకు చేరింది. మొదటి రోజు రూ.69.31 లక్షలు రాగా, బుధవారం రూ.33.32 లక్షలు సమకూరింది. మొత్తం నగదు రూ.1.02 కోట్లు స్థానిక స్టేట్‌ బ్యాంకులో డిపాజిట్‌ చేసినట్లు శ్రీమఠం మేనేజర్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రెండు రోజుల్లో హుండీ లెక్కింపు పూర్తవుతున్నట్లు ఆయన వివరించారు. 
ఈరన్నస్వామికి.. 
ఉరుకుంద ఈరన్నస్వామికి రెండో రోజు హుండీ లెక్కింపులో రూ.14,12,356ల ఆదాయం సమకూరింది. అన్నదానం హుండీ నుంచి మరో రూ.3,67,440లు వచ్చిందని ఈవో మల్లికార్జునప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్‌ చెన్నబసప్పలు తెలిపారు. మొత్తం 17,79,796 రూపాయల హుండి వచ్చినట్లు వారు తెలిపారు. దీనితో పాటు 10గ్రాముల బంగారం, 1,320కేజిల వెండి వచ్చిందన్నారు. కార్యక్రమంలో కర్నూల్‌ ఎండోమెంట్‌ పర్యవేక్షకుడు సుధాకర్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉప ప్రధాన అర్చకుడు మహదేవస్వామి, పర్యవేక్షకులు మల్లికార్జున, వేంకటేశ్వర్లు, పాలక మండలి సభ్యులు కొట్రేష్‌గౌడ్, నరసన్న, మల్లికార్జున, ఈరన్న, ఆంధ్రబ్యాంకు సిబ్బంది, సర్పంచ్‌ ఆదిలక్ష్మి, ఎంపీటీసీ ముత్తమ్మ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు