శ్రీమఠం హుండీ లెక్కింపు ప్రారంభం

28 Nov, 2016 22:53 IST|Sakshi
శ్రీమఠం హుండీ లెక్కింపు ప్రారంభం
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం హుండీ లెక్కింపు సోమవారం సీసీ కెమెరాలు, అధికారుల నిఘా నేత్రాల మధ్య కొనసాగింది. లెక్కింపులో పలు ఆసక్తికర కానుకలు కనిపించాయి. ఓ భక్తుడు హుండీలో కేజీ వెండి బిస్కెట్లు, కంకణం, స్వామి రేకు వేశాడు. మరో భక్తుడు రూ.500 నోట్ల (100 నోట్లు) కట్టను సమర్పించారు. మొదటి రోజు హుండీ ఆదాయం రూ.63,95,600 సమకూరింది. రూ.2000 నోట్లు 106, రూ.వెయ్యి నోట్లు 746, రూ.500 నోట్లు రూ.3,466, రూ.100 నోట్లు 31,746, రూ.50 నోట్లు వెయ్యి, రూ.20 నోట్లు 1500 లెక్కలో తేలాయి. మఠం ప్రధాన హుండీతోపాటు 3 హుండీల ఆదాయాన్ని గణించారు. తహసీల్దార్‌ చంద్రశేఖర్‌వర్మ, ఎస్‌ఐ శ్రీనివాసనాయక్, మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్‌ శ్రీనివాసరావు సమక్షంలో ఎండోమెంట్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ వెంకటేశ్వర్లు హుండీలను తెరిచారు. మరో రెండు రోజుల పాటు హుండీ లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది.
 
మరిన్ని వార్తలు