శ్రీమఠం హుండీ ఆదాయం రూ.1.13 కోట్లు

5 Mar, 2017 00:00 IST|Sakshi
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పిభ్రవరి నెల హుండీ ఆదాయం రూ.1,13,43,483 వచ్చింది. శనివారంతో ముగిసిన హుండీ లెక్కింపు వివరాలను మేనేజర్‌ శ్రీనివాసరావు వివరించారు. నగదు రూ.1.13 కోట్లు, బంగారు 32 గ్రాములు, వెండి కేజీ 490 గ్రాములు, యూఎస్‌ఏ 279 డాలర్లు, మలేసియా 536, న్యూజిలాండ్‌ 50, సింగపూర్‌ 36, యూఏఈ 375 విదేశీ కరెన్సీ వచ్చినట్లు తెలిపారు.   
 
మరిన్ని వార్తలు