పెరుగుతున్న శ్రీశైలం డ్యామ్‌ నీటి మట్టం

4 Jul, 2017 22:12 IST|Sakshi
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైల జలాశయ సెల్ఫ్‌ క్యాచ్‌ మెంట్‌ ఏరియాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా డ్యామ్‌ నీటి మట్టం ప్రతి రోజు రెండు పాయింట్ల చొప్పున పెరుగుతోంది. డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో 8.00 మి.మీ వర్షపాతం నమోదైంది. నీటి మట్టం మంగళవారం సాయంత్రానికి 779.60 అడుగులకు చేరుకుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33 డిగ్రీలు నమోదు అవుతుండటంతో జలాశయంలో 36 క్యూసెక్కుల నీరు ఆవిరి అయినట్లు గేజింగ్‌ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 20.2814 టీఎంసీల నీరు నిల్వ ఉంది.      
 
మరిన్ని వార్తలు