శ్రీశైలం డ్యాం నీటి మట్టం 872.40 అడుగులు

23 Aug, 2016 00:48 IST|Sakshi
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం నీటిమట్టం సోమవారం సాయంత్రం సమయానికి 872.40 అడుగులకు చేరుకుంది. ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో పెరిగింది. శ్రీశైలానికి 16వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 26,406 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. విద్యుత్‌ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 19,881 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 4,500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 151.8195 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
 
మరిన్ని వార్తలు