శ్రీవారి పుష్కరిణికి ఏగతి..!

19 Oct, 2016 22:07 IST|Sakshi
శ్రీవారి పుష్కరిణికి ఏగతి..!
–మురికికూపంలా నృసింహ సాగరం
–ఆవేదనలో భక్తులు
 ద్వారకా తిరుమల :
శ్రీవారి క్షేత్రంలో పుష్కరిణి అధ్వానంగా మారింది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ నృసింహ సాగరం ప్రస్తుతం మురికికూపంగా తయారైంది. పూర్వం ఈ నృసింహ సాగరాన్ని శ్రీవారి కైంకర్యాలకు వినియోగించేవారు. రోజు స్వామివారికి తీర్థపు బిందెను ఈ కోనేరు నుంచే అర్చకులు తీసుకెళ్లేవారు. కాల క్రమేణా ఆ ఆచారం మరుగునపడింది. భక్తులు మాత్రం ఇప్పటికీ స్నానాలు చేసేందుకు ఇక్కడకు వస్తున్నారు. ఏటా వినాయకుని విగ్రహాల నిమజ్జనాలను ఈ చెరువులోనే చేస్తారు. అలాగే పత్రి, ఇతర పూజా సామగ్రిని గ్రామస్తులు ఈ పుష్కరిణిలోనే కలుపుతారు. ఈ ఏడు కూడా భక్తులు వీటిని పుష్కరిణిలో నిమజ్జనం చేశారు. దీంతో చెత్తాచెదారం కోనేరు ఒడ్డుకు చేరడంతో ఆ ప్రాంతమంతా మురికిమయంగా మారింది. కోనేరులో కాలు పెట్టేందుకు కూడా వీలు లేనంతగా తయారైంది. అట్ల తద్దినాడు స్నానాలు ఆచరించేందుకు వచ్చిన పలువురు మహిళలు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి పుష్కరిణిని శుభ్రం చేయించి మోక్షం కలిగించాలని భక్తులు కోరుతున్నారు.  
 
మరిన్ని వార్తలు