శ్రీవారి క్షేత్రంపై పెళ్లిళ్ల సందడి

18 Aug, 2016 23:41 IST|Sakshi
ద్వారకాతిరుమల :  చినవెంకన్న క్షేత్రంలో గురువారం భారీగా వివాహాలు జరిగాయి. శ్రావణమాసంలో మంచిముహూర్తం కావడంతో పలు జంటలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యాయి. సాయంత్రం నుంచి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి పెళ్లి జనాల రాక మొదలవ్వడంతో శేషాచల ప్రాంతం కళకళలాడింది.  ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అలాగే కల్యాణ మండప ప్రాంతం, ఆలయ ప్రధాన రాజగోపుర మెట్ల దారిలో అధికంగా పెళ్లిళ్లు జరిగాయి. వివాహానంతరం కొత్త జంటలు, వారి బంధువులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
శ్రీవారి సేవలో కేంద్ర ప్రణాళిక శాఖ పీడీ
ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని కేంద్ర ప్రణాళిక శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాధాకృష్ణన్‌ గురువారం సందర్శించారు. ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయ ఏఈవో కర్రా శ్రీనివాసరావు ఆయనకు చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు. 
 
మరిన్ని వార్తలు