శ్రీవారికి కలశాభిషేకం

11 Aug, 2016 23:31 IST|Sakshi
హోమం చేస్తున్న ప్రధాన అర్చకులు

ఎర్రుపాలెం : తెలంగాణ తిరుపతి∙జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో రెండో రోజు గురువారం  పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని  శ్రీవేంకటేశ్వరస్వామి వారికి, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లకు, ఆలయ ప్రాంగణంలోని అన్ని ఉప ఆలయాల్లోని దేవతా మూర్తులకు తొలుత ఆలయ అర్చకులు వేద మంత్రాలతో అషో్టత్తర కలశాభిషేకం చేశారు.  ఈ కలశాల పూజలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  యాగశాలలో వేద మంత్రాలతో, మంగళవాయిద్యాలతో సర్వ దేవతా మూర్తులకు హోమాలు నిర్వహించారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారికి, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లకు, ప్రాంగణంలోని దేవతా మూర్తులందరికీ  పవిత్రాలను ధరింప చేశారు. అనంతరం స్వామివారిని శేష వాహనంపై ఉంచి గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణలో పెద్ద ఎత్తున భక్తులు, పాల్గొన్నారు. ఆలయ ఈఓ ఎవి రమణమూర్తి,  చైర్మన్‌ ∙ఉప్పల శివరామ ప్రసాద్‌ ,  ఆలయ ప్రదాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ, ముఖ్య అర్చకులు ఉప్పల విజయదేవ శర్మ, ప్రభాకర్‌ శాస్త్రి, ఆలయ సీనియర్‌ అసిస్టెంట్‌ ఎస్‌ విజయ కుమారి,  అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు