బాస్కెట్‌ బాల్‌ విజేత ఎస్సార్పీ జట్టు

4 Aug, 2016 01:31 IST|Sakshi
రన్నరప్‌గా కొత్తగూడెం, కార్పొరేట్‌ జట్టు
ముగిసిన కంపెనీ స్థాయి పోటీలు
రెబ్బెన(ఆదిలాబాద్‌) : బెల్లంపల్లి ఏరియా పరిధి గోలేటి టౌన్‌షిప్‌లోని శ్రీ భీమన్న స్టేడియంలో జరిగిన సింగరేణి కంపెనీ స్థాయి బాస్కెల్‌ బాల్‌ పోటీల్లో శ్రీరాంపూర్‌ జట్టు విజయం సాధించింది. వర్క్‌ పీపుల్స్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల నుంచి ఆరు జట్లు పాల్గొన్నాయి. పోటీలు మంగళవారం, బుధవారం రెండు రోజులపాటు కొనసాగాల్సి ఉండగా వర్షం కారణంగా మంగళవారం రాత్రే పూర్తి చేశారు. పూల్‌–ఏ, పూల్‌–బీ విభాగాల్లో పోటీలు కొనసాగగా ఫైనల్‌లో కొత్తగూడెం, కార్పొరేట్‌ జట్టు, శ్రీరాంపూర్‌(ఎస్సార్పీ) జట్టు తలపడ్డా యి. కొత్తగూడెం జట్టు 15 పాయింట్లు సాధించగా శ్రీరాంపూర్‌ జట్టు 16 పాయింట్లు సాధించి ఒక పాయింట్‌ తేడాతో విజయం సాధించింది. విన్నర్, రన్నర్‌ జట్లకు ఏరియా జనరల్‌ మేనేజర్‌ కె.రవిశంకర్, ఎస్‌వోటూ జీఎం కొండయ్య బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో డబ్ల్యూపీఎస్‌ అండ్‌ జీఏ గౌరవ కార్యదర్శి రాజేశ్వర్, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు సదాశివ్, ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యద ర్శి ఎస్‌.తిరుపతి, స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ మురళీకృష్ణ, క్రీడాకారులు కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు