మొదలైన వెంకటగిరి రాజకీయం!

20 Apr, 2016 10:37 IST|Sakshi
మొదలైన వెంకటగిరి రాజకీయం!

గంగాప్రసాద్ మేనల్లుడు నానాజీ అరంగేట్రం
రాపూరుపై ఆనం కన్ను
పెంచలకోనలో నానాజీ అభినందనసభ
ఆనం కార్యకర్తల పరిచయ కార్యక్రమాలు
బలనిరూపణ వేదికలేనా?

 
వెంకటగిరి : సార్వత్రిక ఎన్నికలు మూడేళ్లు ఉండగానే వెంకటగిరి రాజకీయ చిత్రం మారుతోంది. 2019లో నియోజకవర్గాల పునర్విభజన జరిగి రాపూరు నియోజకవర్గం ఏర్పాైటైనా, లేకపోయినా వెంకటగిరి నియోజకవర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తెరవెనుక వ్యూహాలు పన్నుతున్నారు బడా నేతలు. సీఎం చంద్రబాబునాయుడుకు సన్నిహితుడైన సూళ్లూరుపేటకు చెందిన గంగాప్రసాద్ తన మేనల్లుడు తానంకి నానాజీకి పెంచలకోన ట్రస్టుబోర్డు చైర్మన్ పదవి ఇప్పించి అధ్యయనం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఈనెల 20న అభినందన సభ నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రులను ఆహ్వానించాలనుకున్నారు.  అయితే 20న సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం కావడంతొ మంత్రులు విజయవాడ తరలనుండటంతో కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది.

మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాపూరు కేంద్రంగా ఈనెల 27న కార్యకర్తల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతంలో రాపూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపోందడంతొ ఈ ప్రాంతంలో గట్టి పట్టున్న నేతలతొ నేటికీ సత్సంబంధాలు నెరుపుతున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతొ ఆపార్టీ కేడర్‌తో సత్సంబంధాలు నెరపేందుకు వ్యూహ ంసిద్ధం చేస్తున్నారు.


 అసమ్మతి నాయకుల ఆసక్తి:
 పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో పనిచేసిన సీనియర్ నాయకులు, ఇతర పార్టీల నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న పలువురు నాయకులకు ఎమ్మెల్యే కురుగోండ్ల రామకృష్ణకు మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కీలకనేత గంగాప్రసాద్ వర్గం వెంకటగిరి రాజకీయాల్లోకి అడుగుపెడుతుండడం అసమ్మతినేతల చూపు ఆనం, నానాజీలపై పడింది. వారం క్రితం డక్కిలిలొ జరిగిన ఓ కార్యక్రమంలొ లింగసముద్రం సింగిల్‌విండో అధ్యక్షుడు వేముల రాజమోహన్‌నాయుడు ఎమ్మెల్యే రామకృష్ణ సమక్షంలొ టీడీపీలో చేరారు. ముందు నుంచి ఆనం వర్గం నేతగా ముద్రపడ్డారు. రాపూరుకు చెందిన కీలకనేత చెన్ను బాలకృష్ణారెడ్డి ఆనంకు సన్నిహితుడు కావడంతొ మరో అధికార కేంద్రం ఏర్పాటు కానుంది.  కమ్మ సామాజిక వర్గానికి చెందిన తానంకి నానాజీ కి టీడీపీ ప్రధానకార్యదర్శి నారాలోకేష్‌తొ సన్నిహిత సంబంధాలు ఉండడంతొ ఆయన నియోజకవర్గంలో కీలకనేతగా మారబోతున్నారు. ఈ పరిణామాలు ఊపిరి పోసుకుంటే ఎమ్మెల్యే కురగొండ్ల రామకృష్ణకు భవిష్యత్తులో కష్టకాలం తప్పదని పలువురు చర్చించుకుంటున్నారు.
 
 స్థానికేతరులకు కలిసొచ్చిన వెంకటగిరి

వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయిన స్థానికులు ఎమ్మెల్యేగిరితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి ఎన్నికైన స్థానికేతరులు మాత్రం మంత్రి, ముఖ్యమంత్రిగా పదవులు అందుకున్న చరిత్ర వెంకటగిరి సోంతం. పాదిలేటి వెంకటస్వామిరెడ్డి, కమతం షణ్ముగం, అల్లం కష్ణయ్య, ఒరేపల్లి వెంకటసుబ్బయ్య, సాయికష్ణయాచేంద్ర, వివిఆర్‌కే  యాచేంద్ర, కురుగొండ్ల రామకష్ణలు ఎమ్మెల్యేలుగా గెలిచినా అంతకుమించి ఎదగలేదు. స్థానికేతరులైన నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి 1978లో ఇక్కడి నుండి ఎన్నికై తొలిసారి పంచదార శాఖ మంత్రిగా అడుగుపెట్టారు. 1983లో ఎన్నికయిన నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పంచాయతీరాజ్ చాంబర్ ఛైర్మన్, 1989లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాకే నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. నేదురుమల్లి రాజ్యలక్ష్మి సైతం 2004లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాక రాష్ట్రమంత్రిగా పనిచేశారు.

మరిన్ని వార్తలు