27 నుంచి రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలు

24 Aug, 2016 01:13 IST|Sakshi
మార్టేరు, (పెనుమంట్ర) : క్రీడా గ్రామంగా పేరొందిన మార్టేరులో స్వర్గీయ పడాల ప్రహ్లాదరెడ్డి మెమోరియల్‌ రాష్ట్రస్థాయి ఇన్విటేషన్‌ బాస్కెట్‌బాల్‌ పోటీలను నిర్వహించనున్నారు. గ్రామంలోని వేణుగోపాల స్వామి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు