రాష్ట్ర ఉత్తమ పశు వైద్యాధికారిగా సునీల్‌దత్‌

20 Sep, 2016 21:33 IST|Sakshi
సునీల్‌దత్‌ను సన్మానిస్తున్న పశుసంవర్దక శాఖ అధికారులు

ఝరాసంగం: మండలంలో పశువైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న డా.సునీల్‌దత్త్‌కు రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట సేవలందించినందుకు గాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పశువైద్యాధికారిగా అవార్డును అందజేసింది. సోమవారం హైదారాబాద్‌లోని పశుసంవర్దకశాఖ కమీషనరు కార్యాలయంలో క్రిష్ణ ఎండోమెంటు వారి ఆధ్వర్యంలో పశుసంవర్దకశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ సురేష్‌చంద్ర, డైరెక్టరు వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అవార్డును అందుకోవటం జరిగిందన్నారు.

ఈయన 2012సంవత్సరంలో నారాయణఖేడ్‌ నుండి ఝరాసంగంకు బదిలీపై వచ్చి విధులను నిర్వర్తిస్తున్నాడు. అంతకుముందు నారాయణఖేడ్‌లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించి ఉత్తమ అవార్డులను కైవసం చేసుకున్నాడు. అవే రీతిలో మండలంలోని ఆయా గ్రామాలలో ఎప్పటికప్పుడు పర్యటించి పశుపోషకుల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేసేవాడు. గ్రామాలలోని మూగజీవాలు వ్యాధుల బారినపడకుండా ముందస్థుగా వ్యాక్సినేషన్‌ వేసి తీసుకోవాల్పిన జాగ్రత్తలను వివరించేవాడు.

ఈ విధంగా మండలంలో పశువులు వ్యాధుల బారిన పడకుండా విశిష్ఠ సేవలందించాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అవార్డు రావటంతో ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. మండలంలో అందించే సేవల్ని ప్రభుత్వం గుర్తించి అవార్డును అందించింది. అవార్డుతో పాటు మరింత బాధ్యత పెరిగిందన్నారు. రాష్ట్రంలో తనతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పశువైద్యాదికారికి అవార్డు రావటంజరిగిందన్నారు.

అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 8మంది పశుపోషకులను కూడా అవార్డులను అందించారన్నారు. మండలంలోని ప్రజల సహకారంతో, తోటి సిబ్బందితో మరిన్ని సేవలను అందిస్తానన్నారు. తాను అందించే సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగపర్చుకోవాలన్నారు. అవార్డు రావటం పట్ల ఆయనకు తోటి సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు