రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

29 Sep, 2016 21:49 IST|Sakshi
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
కిర్లంపూడి : 
అక్టోబర్‌ 1 నుంచి 3 వరకు నెల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి 50వ ఖోఖో ఛాంపియన్‌షిప్‌ పోటీలకు జిల్లా జట్టును గురువారం సాయంత్రం కిర్లంపూడిలో ఎంపిక చేశారు. స్థానిక యంగ్‌మెన్స్‌ స్పోర్ట్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపిక కార్యక్రమంలో కిర్లంపూడికి చెందిన కేఎల్‌ పాపారావు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. జట్టులో పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన వై.సతీష్, పి.వెంకటేశ్వరరావు, ఆర్‌.గంగాధర్‌రావు, కొవ్వాడ గ్రామానికి చెందిన ఎం.కృష్ణ, తాళ్లరేవుకు చెందిన బి.సతీష్,  ఏవీ శేఖర్, ఇంద్రపాలెంకు చెందిన టీకే పవన్, దివిలికి చెందిన హరీష్, నాగబాబు, ఏపీ త్రయంకు కె.సాయిరాం, విరవాడకు చెందిన ఎం.వెంకటరమణ, దివిలికి చెందిన ఆర్‌.శివ ఇతర సభ్యులు. జట్టుకు కోచ్‌గా బి.ఆదినారాయణ, ప్రగతి పీడీ జి.అప్పారావు వ్యవహరించనున్నారు. వారం రోజులుగా కిర్లంపూడిలో నిర్వహిస్తున్న శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమాన్ని ఉద్ధేశించి జగపతినగరం సర్పంచి పెంటకోట నాగబాబు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. జిల్లా ఖోఖో అసోసియేషన్‌ అధ్యక్షుడు నలమాటి జానకిరాయమ్మ, కార్యదర్శి కె.పట్టాభిరామ్, కోశాధికారి కె.శ్రీనివాసరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ చదలవాడ బాబి తదితరులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు