ఉత్తమ ప్రదర్శన ఇంటింటి కధ

11 Mar, 2017 23:21 IST|Sakshi
ఉత్తమ ప్రదర్శన ఇంటింటి కధ
తాటిపర్తిలో ముగిసిన రాష్ట్రస్థాయి నాటకపోటీలు
గొల్లప్రోలు (పిఠాపురం) : తాటిపర్తిలోని అపర్ణ నాటక కళాపరిషత్‌ ఆధ్వర్యంలో వారం రోజులుగా జరుగుతున్న 6వ రాష్ట్రస్థాయి నాటకపోటీలు ముగిసాయి. ఉత్తమ ప్రదర్శనగా హైదరాబాద్‌కు చెందిన విజయాదిత్య ఆర్ట్స్‌ బృందం ప్రదర్శించిన ‘ఇంటింటి కధ’  ఎంపికకాగా ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా హైదరాబాద్‌కు చెందిన కళాంజలి బృందం ప్రదర్శించిన ‘జారుడుమెట్లు ’ ఎంపికైంది. ఉత్తమనటుడుగా ఇంటింటి కధ పాత్రధారి గోపరాజు విజయ్,  ఉత్తమనటిగా జారుడుమెట్లు పాత్రధారి నవీన, ఉత్తమ రచనకు ఎస్‌ఎస్‌ఆర్‌కే గురుప్రసాద్‌ (ఇంటింటి కధ), ఉత్తమ దర్శకత్వానికి కొల్లా రాధాకృష్ణ (జారుడుమెట్లు), ఉత్తమ సంగీతం –సాంబశివరావు (ఇంటింటి కధ), రంగాలంకరణ–పిఠాపురం బాబూరావు (మళ్లీ మరోజన్మంటూ ఉంటే), ఉత్తమ ప్రతినాయకి– రజనీ శ్రీకళ (జారుడుమెట్లు), ఉత్తమ హాస్యనటుడు– పీఎస్‌ సత్యనారాయణ (ఇంటింటి కధ), సహాయ నటి–రమాదేవి æ(ఇంటింటి కధ), సహాయనటుడు–వరప్రసాద్‌ (జారుడుమెట్లు), ఆహార్యం– పరమేశ్వరరావు(మళ్లీ మరోజన్మంటూ ఉంటే), ఎంపికయ్యారు. విజేతలకు ప్రముఖసినీ రచయిత, నటుడు ఎంవీఎస్‌ హరనాథరావు, నాటకపరిషత్‌ కార్యదర్శి బత్తుల వీరభద్రం, ఆకొండి వెంకటేశ్వరశర్మ, దాసం కామరాజు, బాబూరావు, ఆకొండి వెంకటేశ్వరరావు, అమరాది గోపాలకృష్ణ,  ప్రభాకరశాస్త్రి, సిద్దా నానాజీ,  న్యాయనిర్ణేతలు రాజా తాతయ్య, సీఎ¯ŒS మూర్తి, కె పుల్లారావు తదితరులు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. హరనాథరావు మాట్లాడుతూ అపర్ణ నాటకకళాపరిషత్‌ ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన నాటకపోటీలు రసవత్తరంగా సాగాయన్నారు. ప్రతీ సంవత్సరం నాటకాలను ఎంతగానో ఆదరిస్తున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడ నాటకరంగం రక్షించబడుతుందో అక్కడ కళారంగం అభివృద్ధి చెందుతుందన్నారు. కళాపరిషత్‌లు నాటక రంగానికి జీవం పోస్తున్నాయని తెలిపారు. 
 
మరిన్ని వార్తలు