ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు

16 Oct, 2016 23:06 IST|Sakshi
బాలుర విజేత వైఎస్‌ఆర్‌ జిల్లా జట్టుకు ట్రోఫీని అందజేస్తున్న ఎస్పీ ఆకె రవిక్రిష్ణ
విజేతలుగా నిలిచిన కడప, అనంతపురం జట్లు
 
కల్లూరు: కర్నూలు నగర శివారులోని ఇండస్‌ స్కూల్‌ క్రీడామైదానంలో జరుగుతున్న 62వ రాష్ట్ర స్థాయి అండర్‌ 14 బాలబాలికల హాకీ పోటీలు ఆదివారం ముగిశాయి. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. బాలుర విభాగంలో కడప జట్టు 5–0 గోల్స్‌ తేడాతో అనంతపురంపై విజయం సాధించింది. మూడో స్థానానికి చిత్తూరు, కర్నూలు జట్లు పోటీపడగా 5–0 గోల్స్‌ తేడాతో చిత్తూరు జట్టు జయకేతనం ఎగురవేసింది. బాలికల విభాగంలో అనంతపురం, కడప జట్ట మధ్య హోరాహోరీగా ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. నిర్ణీత సమయంలో ఏ జట్టు గోల్‌ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ నిర్వహించారు. ఇందులో అనంతపురం జట్టు 4–1 గోల్స్‌ తేడాతో విజయం సాధించగా కడప జట్టు రన్నర్స్‌ స్థానాల్లో నిలిచింది. మూడో  స్థానానికి చిత్తూరు, వైజాగ్‌ జట్లు పోటీపడ్డాయి. 2–0 గోల్స్‌ తేడాతో చిత్తూరు జట్టు జయకేతనం ఎగుర వేసింది. విజేత జట్లకు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ  ట్రోఫీలు, మెడల్స్‌ అందజేశారు. కార్యక్రమంలో ఇండస్‌ స్కూల్‌ అధినేత కేఎన్‌వీ రాజశేఖర్, జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు విజయకుమార్, క్రీడాపోటీల పరిశీలకుడు థామస్‌ పీటర్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, పీఈటీలు,  తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు