భౌబోయ్

19 Feb, 2016 02:57 IST|Sakshi
భౌబోయ్

గ్రామసింహాల స్వైరవిహారం
తీవ్రమవుతున్న బెడద
ఆస్పత్రులకు పెరుగుతున్న కుక్కకాటు కేసులు
హడలిపోతున్న జనం

సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 48 ప్రా థమిక ఆరోగ్య కేంద్రాలు, 11 సివిల్ ఆస్పత్రులున్నాయి. తాండూరు జిల్లా ఆస్పత్రి, కొండాపూర్, వనస్థలిపురం ప్రాంతీయ ఆస్పత్రుల్లో కుక్కకాటు కేసులను పరిశీలిస్తారు. జిల్లాలో ఏడాదిలో ఇప్పటివరకు ఏకంగా 5,200 కేసులు నమోదైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇవి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన కేసులు మాత్రమే. ఇవి కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ  కేసులు నమోదవుతున్నప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకోవడం లేదు. కుక్కకాటుతో కలిగే ఇన్ఫెక్షన్‌తో జిల్లాలో ఇప్పటివరకు 38 మంది మృత్యువాత పడ్డారు.

బడ్జెట్ సాకుగా చూపుతూ..
కుక్కకాటుకు సంబంధించి ఏఆర్‌వీని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుంది. ఆస్పత్రిస్థాయిలో ప్రత్యేకంగా నిధులను సైతం కేటాయిస్తుంది. జిల్లాలో పలు గ్రామీణ ప్రాంత ఆస్పత్రుల్లో ఏఆర్‌వీ అందుబాటులో లేదు. అత్యవసర చికిత్స కింద ఏఆర్‌వీ అందుబాటులో పెట్టాల్సిందిగా వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తున్నప్పటికీ.. జిల్లా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో దాదాపు 5,500 యూనిట్ల ఏఆర్‌వీ స్టాకు ఉన్నప్పటికీ.. పలువురు మెడికల్ ఆఫీసర్లు వీటిని తీసుకెళ్లకపోవడంతో సీడీఎస్‌లో స్టాకు మూలుగుతోంది.

బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలు
తాండూరు రూరల్: వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. అడ్డువచ్చినవారినల్లా మీదపడి రక్కేస్తున్నాయి. గుంపులుగా చేరి ఒంటరిగా ఉన్న చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. వీటి బారినపడిన ఎంతోమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జనవరిలో జిల్లా ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో 80 కేసులు, ఫిబ్రవరి 18వ తేదీ వరకు 43 కేసులు నమోదైనట్లు సిబ్బంది తెలిపారు. ఇక ఓపీలో జనవరిలో 100 నుంచి 200 వరకు, ఫిబ్రవరిలో ఇప్పటి వరకు 70 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉం దో అర్థం చేసుకోవచ్చు. డివిజన్ నుంచి జిల్లా ఆస్పత్రికి నిత్యం పదుల సంఖ్యలో కుక్కకాటు బాధితులు వస్తున్నారు. పట్టణంలో 1000 నుంచి 1500 వరకు కుక్కలున్నట్లు అంచనా. ప్రజల నుంచి రోజూ ఫిర్యాదులు వస్తున్నాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.

ప్రాణపాయం నుంచి బయటపడి..
యాలాల మండలం గొరెపల్లికి చెందిన బుట్ల నర్సప్ప, నర్సమ్మ దంపతులు. వారం రోజుల క్రితం నర్సమ్మ కుమారుడు నవీన్‌కుమార్ (5)ను తీసుకొని వారి పొలంలో వరినాట్లు వేసేందుకు వెళ్లింది. బాలుడు పొలం గట్టుమీద ఆ డుకుంటుండంగా ఓ వీధికుక్క దాడిచేసింది. తల్లి తేరుకునేలోపే బాలుడి చెం పభాగంలో తీవ్ర గాయాం చేసి ఉడాయించింది. వెంటనే తల్లిదండ్రులు బాలుడిని తీసుకొని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రికి రిఫర్ చేశా రు. బాలుడి తల్లిదండ్రులు హైదరాబా ద్ తీసుకెళ్లి వైద్యం చేయించుకున్నారు. 

అందుబాటులో వ్యాక్సిన్...
జిల్లా ఆస్పత్రిలో యాంటీరేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కుక్కకాటు తర్వాత ప్రథమ చికిత్సలో భాగంగా సబ్బుతో పది నిమిషాల వరకు గాయం వద్ద కడగాలి. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకురావాలి. 3 నుంచి 5 డోసుల వరకు వ్యాక్సిన్ ఇప్పించాలి. మెదడు పైభాగంతో పాటు ముఖం, చేతులకు పెద్ద కాట్లు ఉంటే ఇమినోగ్లోబిన్ వ్యాక్సిన్ ఇప్పించాలి. ఈ వ్యాక్సిన్ తెలంగాణలో ఒక్క ఫీవర్ ఆస్పత్రిలోనే దొరుకుతుంది. - భాగ్యశేఖర్, సూరింటిండెంట్, జిల్లా ఆస్పత్రి

పాదచారులకు దడ
తాండూరు: గ్రామసింహాల బెడదతో పట్టణవాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పట్టణంలోని పలు ప్రాంతాల్లో శునకాల సమస్యతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో పాదచారులపై దాడికి పాల్పడుతున్నాయి. గాయపడ్డ వారు పట్టణంలోని జిల్లా ఆస్పత్రితోపాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. పట్టణంలోని పాత తాండూరు, పాత, కొత్త కూరగాయల మార్కెట్, యశోధనగర్, రహమత్‌నగర్ తదితర ప్రాంతాల్లో శునకాల బెడద తీవ్రంగా ఉందని ఆయా ప్రాంతాల నుంచి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మాంసం వ్యర్థాలను తింటున్న కుక్కలు స్థానికులపై దాడికి దిగుతున్నాయని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. ఈనేపథ్యంలో మున్సిపల్ శానిటేషన్ విభాగం అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. కుక్కలకు మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ వాటిని పట్టణానికి దూరంగా వదిలేస్తున్నట్టు మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. మాంసం వ్యర్థాలు రోడ్ల పక్కన పడేయరాదని దుకాణదారులకు సూచించినట్టు చెప్పారు. కుక్కల దాడిలో గాయపడ్డ వారికి చికిత్స అందించేందుకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని జిల్లా ఆస్పత్రి డ్రగ్స్ స్టోర్ ఇన్‌చార్జి మహేష్ తెలిపారు.

అందుబాటులో లేని వ్యాక్సిన్
ఘట్‌కేసర్: మండలంలోని నారపల్లి ప్రాథమిక ఆస్పత్రిలో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ (ఏఆర్‌వీ) 15రోజులుగా అందుబాటులో లేదు. వాక్సిన్ నిమిత్తం వచ్చిన వారిని మండల కేంద్రంలోని వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రికి పంపుతున్నారు. వాక్సిన్లు లేని విషయం స్థానిక వైద్యులు జిల్లా అధికారులకు సమాచారమిచ్చారు. గత పదినెలల్లో 132 వ్యాక్సిన్లు అందజేసినట్లు తెలిపారు. మండలకేంద్రానికి వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సమయం, డబ్బు వృథా అవుతోందన్నారు.

బయటికి వెళ్లాలంటే భయమే..
ఇబ్రహీంపట్నం : పట్నం నగర పంచాయతీ పరిధిలో ఎటు చూసినా వీధి కుక్కలు స్వైర వి హారం చేస్తున్నాయి. ప్రతి కౌన్సిల్ సమావేశం లో కుక్కల బెడదపై చర్చ వస్తుండడమేగాని సమస్య పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు. రోజుకు రెండు నుంచి మూడు కేసులు, నె లకు 60 నుంచి 70 మంది కుక్కకాటుకు గురై ఆ స్పత్రికి వస్తున్నట్లు ప్రభుత్వ వైద్యాధికారులు తెలిపారు. మరీ ఎక్కుగా గాట్లు పడిన బాధితులను నగరంలోని నారాయణగూడ ఐపీఎం, ఫీవర్ ఆస్పత్రులకు  పంపుతున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన సాయిలు ఇటీవల కుక్కకాటు బారినపడ్డాడు. రాత్రివేళ ఇంటికి భయంతో వెళ్లాల్సి వస్తోందని వాపోయాడు. కుక్కలు ఎటు నుంచి వచ్చి దాడిచేస్తాయోనని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందంటున్నాడు. 

సత్వర చికిత్స..
కుక్కకాటుకు గురైన వారికి చికిత్స అందించేందుకు మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖం, మెడపై కుక్క కరిస్తే దాని ప్రభావం మెదడుపై పడకుండా సత్వర చికిత్స కోసం నగరంలోని నారాయణగూడ, ఫీవర్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నాం. - డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సివిల్ సర్జన్

మేడ్చల్‌లో తీవ్రమవుతున్న బెడద
మేడ్చల్: వీధి కుక్కల బెడద పట్టణంలో రోజురోజుకూ తీవ్రమవుతోంది. పట్టణంలోని కింది బస్తీ, వీకర్‌సెక్షన్, ఉవూనగర్, ఆర్టీసీ కాలనీ, చంద్రనగర్, సూర్యనగర్, బాలాజీనగర్ కాలనీల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు, వుహిళలు, వృద్ధులు వీధుల్లోకి రావాలంటేనే హడలిపోతున్నారు. కాలనీల్లో చి న్నపిల్లలను ఒంటరిగా వదిలిపెట్టాలన్నా, కొత్తవారు కాలనీ లకు రావాలన్నా జంకుతున్నారు. రెండు నెలల క్రితం ఉవూనగర్‌లో ఇంటికి వెళ్తున్న తల్లీబిడ్డలను కరిచాయి. వుూడు నెలల క్రితం జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలకు చెం దిన ఓ బాలుడు కుక్కకాటు బారిన పడ్డాడు. పట్టణ పరిధిలో రోజుకు కనీసం మూడు వరకు కుక్కకాటు కేసులు  నమోదవుతున్నారుు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండడంతో తక్షణ చికిత్స లభిస్తోంది.

 ఎక్కడ చూసినా అంతే..
ఏ వీధిలోకెళ్లినా కుక్కలు గుంపులుగా కనిపిస్తున్నా యి. రాత్రివేళ వెంటబడి త రువుుతున్నారుు. కాలనీల్లో ఇళ్ల వుుందు ఆడుకుంటున్న చిన్నపిల్లలను కరుస్తున్నాయి.   -ఆకుల ప్రభాకర్, మేడ్చల్

 పరిష్కరిస్తాం..
పట్టణంలో కుక్కల బెడద ఉందని దృష్టికి వచ్చింది. సవుస్యను పరిష్కరించడానికి జీహెచ్‌ఎంసీ అధికారులతో వూట్లాడాం. వారి స హకారంతో వారం రోజుల్లో వాటి బెడదను నివారిస్తాం.  -రామిరెడ్డి, మేడ్చల్ నగరపంచాయుతీ కమిషనర్

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా